ETV Bharat / business

హోమ్ లోన్ కోసం మంచి బ్యాంక్‌ను ఎంచుకోవాలా? ఈ టాప్‌-6 టిప్స్ మీ కోసమే! - HOW TO CHOOSE A BANK FOR HOME LOAN

గృహ రుణం కోసం ప్రయత్నిస్తున్నారా? ముందుగా ఈ విషయాలు తెలుసుకోవడం మస్ట్​!

Home Loan
Home Loan (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 16, 2024, 12:48 PM IST

How To Choose A bank For Home Loan : సొంత ఇల్లు కట్టుకోవడం అనేది చాలా మందికి ఒక జీవిత ఆశయంగా ఉంటుంది. ఇందుకోసం అప్పటి వరకు పొదుపు చేసుకున్న డబ్బులు వాడుతారు. అలా వీలుకాకపోతే బ్యాంకు రుణం తీసుకుని మంచి ఇల్లు కొనుక్కోవాలని లేదా కట్టుకోవాలని ఆశపడతారు. మరి మీరు కూడా హోమ్ లోన్ తీసుకుని మీ కలల ఇంటిని కొనుగోలు చేయాలని అనుకుంటున్నారా? అయితే ఇది మీ కోసమే.

గృహ రుణం ఎక్కడపడితే అక్కడ తీసుకోవడం ఏ మాత్రం మంచిది. అందువల్ల ఏ బ్యాంకు నుంచి హోమ్ లోన్ తీసుకోవడం మంచిదో ముందుగానే తెలుసుకోవాలి. దీని వల్ల తక్కు వడ్డీ రేటు, ప్రాసెసింగ్ ఫీజుతో రుణం లభిస్తుంది. ఫలితంగా రుణ గ్రహీతకు గణనీయంగా డబ్బు ఆదా అవుతుంది. ఇంకా మీరు ఏయే విషయాలు పరిశీలించాలంటే?

1. వడ్డీ రేటు : ఇంటిని కొనుగోలు చేయాలన్నా లేదా నిర్మించాలన్నా చాలా పెద్ద మొత్తంలో డబ్బు అవసరం అవుతుంది. కనుక కట్టాల్సిన వడ్డీ కూడా ఎక్కువగానే ఉంటుంది. పైగా దీర్ఘకాలం పాటు నెలవారీ వాయిదాలు (ఈఎంఐ) చెల్లించాల్సి ఉంటుంది. అందువల్ల వివిధ బ్యాంకులు అందించే వడ్డీ రేట్లను కచ్చితంగా సరిపోల్చి చూసుకోవాలి. అనేక వెబ్‌సైట్‌లు, వివిధ ఫైనాన్షియల్‌ ప్లాట్‌ఫామ్స్‌ వివిధ బ్యాంకుల్లోని గృహ రుణ వడ్డీ రేట్ల డేటాను చూపిస్తాయి. కనుక వాటిని సరిపోల్చుకుని తక్కువ వడ్డీ రేటుతో రుణం ఇస్తున్న బ్యాంకును ఎంచుకోవాలి. వాస్తవానికి 1% తక్కువ వడ్డీ రేటుకు రుణం లభించినా కూడా రుణ గ్రహీతకు లక్షల్లో డబ్బు ఆదా అవుతుంది. అందుచేత, తక్కువ వడ్డీ రేటుకు రుణం అందించే బ్యాంకును ఎంచుకోవాలి. ఉదాహరణకు 20 సంవత్సరాల కాలవ్యవధికి ఇంటిపై 10% వడ్డీకి రూ.50 లక్షల రుణం తీసుకున్నారని అనుకుందాం. అప్పుడు అసలు కాకుండా వడ్డీ మాత్రమే రూ.65.80 లక్షల వరకు చెల్లించవలసి ఉంటుంది. అదే రుణంపై 9% వడ్డీ విధించే బ్యాంకును ఎంచుకుంటే, మీరు రూ.57.96 లక్షలు వడ్డీ చెల్లిస్తే సరిపోతుంది. అంటే 1% తక్కువ వడ్డీని విధించే బ్యాంకును ఎంచుకోవడం ద్వారా, మీరు సుమారుగా రూ.7.80 లక్షల వరకు ఆదా చేసుకోవచ్చు.

2. ఫీజులు : బ్యాంకులు గృహ రుణాలు మంజూరు చేసేటప్పుడు ప్రాసెసింగ్‌, లీగల్‌, అడ్మినిస్ట్రేటివ్‌ ఛార్జీలు, లోన్‌ స్టాంప్‌ డ్యూటీ, ఇన్టిమేషన్‌ ఛార్జీలు లాంటి అనేక రుసుములను వసూలు చేస్తాయి. ఈ రుసుములు ఆయా బ్యాంకులను బట్టి మారుతుంటాయి. ఈ రుసుములు రుణ మొత్తంలో 0.25% నుంచి 2% వరకు ఉండవచ్చు. మరీ ముఖ్యంగా ప్రాసెసింగ్‌ ఫీజును కనీసం 1% వసూలు చేసినా చాలు, మీపై రుణ భారం పెరుగుతుంది. ఉదాహరణకు మీరు రూ.50 లక్షలు రుణం తీసుకుంటే రూ.50 వేలు వరకు ప్రాసెసింగ్‌ ఫీజును చెల్లించమంటే, అది కచ్చితంగా చాలా ఆర్థిక భారమే అవుతుంది. అందుకే ఈ భారం తగ్గించుకునేందుకు ప్రయత్నించాలి. కొన్ని బ్యాంకులు పండగ సమయాల్లో, పరిమిత కాలవ్యవధికి ప్రత్యేక ఆఫర్లు ప్రకటించి, ప్రాసెసింగ్‌ ఫీజును రద్దు చేస్తాయి. కనుక అలాంటి ఆఫర్లను మీరు వినియోగించుకోవాలి. అలాగే మిగతా వాటితో పోల్చితే, తక్కువ రుసుములను వసూలు చేసే బ్యాంకును ఎంచుకోవాలి.

3. అడ్వాన్స్‌ పేమెంట్‌ : మీ ఇంటి రుణాన్ని ముందుగానే చెల్లించాలని అనుకుంటే, కొన్ని బ్యాంకులు బకాయిపై 2% వరకు రుసుమును విధిస్తుంటాయి. అందువల్ల ముందస్తు చెల్లింపులు, జప్తు నిబంధనల గురించి, బ్యాంకు పాలసీ గురించి ముందుగానే తెలుసుకోవాలి. కొన్ని బ్యాంకులు ముందస్తుగా రుణాన్ని చెల్లించేటప్పుడు జరిమానాలు కూడా వసూలు చేస్తుంటాయి. మరికొన్ని రుణ సంస్థలు మాత్రం రుణగ్రహీతలకు సౌకర్యవంతమైన నిబంధనలను అందిస్తాయి. సాధారణంగా బ్యాంకులు మీ వయసు, ఆదాయం, ఉపాధి స్థిరత్వం, క్రెడిట్‌ స్కోర్‌ సహా నిర్దిష్ట అర్హత ప్రమాణాలను చూసి హోమ్ లోన్ ఇస్తుంటాయి. అలాగే రుణం ఇచ్చే ముందు అనేక నిబంధనలు విధిస్తూ ఉంటాయి. కనుక తక్కువ లేదా సులభతరమైన నిబంధనలు ఉన్న బ్యాంకు నుంచి మాత్రమే గృహ రుణం తీసుకోవడం మంచిది.

4. ఆఫర్స్‌ : కొన్ని బ్యాంకులు మహిళా రుణ గ్రహీతలకు, ప్రభుత్వ ఉద్యోగులకు, ప్రత్యేక నిపుణులకు ప్రత్యేక ఆఫర్లు, వడ్డీ రేటు తగ్గింపులతో హోమ్ లోన్స్‌ అందిస్తాయి. కనుక ఇలాంటి కేటగిరీలోకి మీరు వస్తే, కచ్చితంగా ఆ ఆఫర్లను సద్వినియోగం చేసుకోవాలి. కొన్ని బ్యాంకులు వడ్డీ ఆదా చేసుకోవడానికి మీ హోమ్‌ లోన్‌ ఖాతాను, కరెంట్‌ ఖాతాతో లింక్‌ చేసుకోవడానికి అనుమతి ఇస్తాయి. మీ కరెంట్‌ ఖాతాలోని మిగులును బ్యాంకు పరిగణనలోకి తీసుకుంటుంది. దీనివల్ల మీ రుణ భారం చాలా వరకు తగ్గుతుంది. కొన్ని బ్యాంకులు ప్రీ-ఈఎంఐ ఆఫర్‌ను కూడా అందిస్తుంటాయి. అంటే కొంత కాలవ్యవధి వరకు ఇంటి రుణంపై వడ్డీని మాత్రమే చెల్లిస్తారు. ప్రీ-ఈఎంఐ కాలవ్యవధి ముగిసిన తర్వాత ఈఎంఐ భారం పెరుగుతుంది. మరికొన్ని బ్యాంకుల్లో కొన్ని సంవత్సరాల పాటు ఈఎంఐ వాయిదాలను ఎక్కువ మొత్తంలో స్థిరంగా చెల్లిస్తూ ఉంటే, కొన్ని ఈఎంఐ చెల్లింపులను (6-12 నెలలు) మాఫీ చేస్తాయి. అంతేకాదు మార్కెట్లో ఫ్లెక్సీ హోమ్‌ లోన్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇది స్థిర, ఫ్లోటింగ్‌ వడ్డీ రేట్ల కలయికతో ఉంటాయి. ఈ పథకంలో బ్యాంకులు ప్రారంభ సంవత్సరాల్లో స్థిర వడ్డీ రేటును వసూలు చేస్తాయి. మిగిలిన కాలవ్యవధిలో ఉన్న రుణ మొత్తంపై ఫ్లోటింగ్‌ వడ్డీ రేటు విధిస్తాయి. ప్రస్తుతం అనేక రకాల గృహ రుణ పథకాలు అందుబాటులో ఉన్నాయి. కనుక మీ ఆర్థిక పరిస్థితిని బట్టి మీకు ఏది సరిగ్గా సరిపోతుందో అంచనా వేసి, అలాంటి రుణాలు తీసుకోవడమే మంచిది.

5. కస్టమర్‌ సర్వీస్‌ : నేటి సాంకేతిక, ఆన్‌లైన్‌ సేవల యుగంలో కస్టమర్ సర్వీస్‌ అనేది అత్యంత ముఖ్యమైపోయింది. అందువల్ల రుణ గ్రహీతలు అత్యుత్తమ ఆన్‌లైన్‌ సేవలను అందించే బ్యాంకును మాత్రమే ఎంచుకోవాలి. దీనివల్ల రుణ వాయిదాలు చెల్లించేటప్పుడు చాలా సమయాన్ని ఆదా చేసుకోవచ్చు. వాస్తవానికి గృహ రుణం పొందడం ఒక ఎత్తు అయితే, ఆ తర్వాత బ్యాంకుతో కనీసం 10 నుంచి 20 ఏళ్ల పాటు సరైన సంబంధాలు కలిగి ఉండడం మరో ఎత్తు. కాబట్టి, రుణ ఆమోద ప్రక్రియ నుంచి రుణం తీరే వరకు బ్యాంకు అందించే కస్టమర్‌ సర్వీస్‌ గురించి కచ్చితంగా తెలుసుకోవాలి. బ్యాంకు సేవల నాణ్యత, ప్రతిస్పందన చాలా ముఖ్యం. కాబట్టి మేలైన సేవలు అందించే, వేగంగా స్పందించే సాంకేతికత గల బ్యాంకును మాత్రమే రుణ గ్రహీతలు ఎంచుకోవడం మంచిది.

6. కాలపరిమితి : సాధారణంగా బ్యాంకులు రుణ గ్రహీత వయసు, ఆదాయాలను బట్టి ఈఎంఐ కాలవ్యవధిని నిర్ణయిస్తాయి. సుదీర్ఘ కాల వ్యవధిని ఎంచుకుంటే మీరు చెల్లించాల్సిన ఈఎంఐ తక్కువగా ఉంటుంది. తక్కువ కాల వ్యవధిని ఎంచుకుంటే ఈఎంఐ భారం పెరుగుతుంది. కనుక మీ ఆర్థిక పరిస్థితులు, ఈఎంఐ చెల్లింపు సామర్థ్యాన్ని బట్టి, మీకు అనువైన రుణ కాలపరిమితిని అందించే బ్యాంకును ఎంచుకోవాలి.

నోట్ : ఈ ఆర్టికల్‌లో చెప్పిన అంశాలు కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. మీకు హోమ్ లోన్ విషయంలో ఏవైనా సందేహాలు ఉంటే, వాటిని నివృత్తి చేసుకోవడానికి హోమ్‌ లోన్‌ అడ్వైజర్‌/ఫైనాన్షియల్‌ కన్సల్టెంట్‌ను సంప్రదించడం మంచిది.

హోమ్​ లోన్ సకాలంలో చెల్లించలేకపోతున్నారా? ఇలా చేస్తే ఏ ఇబ్బందీ రాదు! - timely Home Loan EMI Repayments

మీ హోమ్ రెనోవేషన్​ కోసం రుణం కావాలా? ఇలా చేస్తే లోన్ గ్యారెంటీ! - How To Get Loan For Home Renovation

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.