1.అనర్హులపై కన్ను!
గ్రేటర్ హైదరాబాద్ ఓటరు జాబితాలో పేరుండి ప్రస్తుతం నివాసం లేనివారు, చిరునామా మార్చిన వారి వివరాలు అందించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. నకిలీ ఓటర్లు, చనిపోయిన వారి జాబితాలు పోలింగ్ కేంద్రాల వారీగా అందించాలని కోరింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2.'విజయం మాదే'
హైదరాబాద్‌ను అభివృద్ధి చేసిన ఘనత తెరాసకే దక్కుతుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. సికింద్రాబాద్‌లోని అల్వాల్, మచ్చ బొల్లారం, వెంకటాపురం డివిజన్లకు చెందిన తెరాస అభ్యర్థులు విజయ శాంతి, జితేంద్రనాథ్, సబితా నామినేషన్ దాఖలు కార్యక్రమంలో పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3.కన్నీటి గోస
పత్తి కొనుగోళ్ల ప్రక్రియ మందకోడిగా సాగుతోంది. ఆశించిన స్థాయిలో సరకు మార్కెట్‌కు రావడం లేదు. రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో పత్తి పంట తీవ్రంగా దెబ్బతింది. పింక్ బోల్వార్మ్తో మిగిలిన కాస్త పంట దెబ్బతినడం వల్ల దిగుబడి తగ్గింది. గత ఏడాది వానా కాలం సీజన్‌లో 60 లక్షల పత్తి బేళ్లు మార్కెట్‌కు వస్తే.. ఈసారి 30 లక్షల బేళ్లకు మించి వచ్చే పరిస్థితి లేదని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4.తల్లీ, ఇద్దరు కుమార్తెలు మృతి
నాగర్‌కర్నూలు జిల్లా బిజినేపల్లి మండలం ఒట్టెంలో విషాదం చోటుచేసుకుంది. ఒట్టెం శివారు చెరువులోపడి తల్లీ, ఇద్దరు కుమార్తెలు మృతి చెందారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5.మాస్క్ లేకుంటే...
దిల్లీలో కరోనా నివారణకు చర్యలు ముమ్మరం చేసింది అక్కడి ప్రభుత్వం. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు తప్పనిసరిగా ధరించాలని ఆదేశించింది. మాస్కు లేకుంటే రూ.500గా ఉన్న జరిమానాను రూ.2 వేలకు పెంచింది. కరోనా రోగుల చికిత్స కోసం 1400 ఐసీయూ పడకలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు ముఖ్యమంత్రి కేజ్రీవాల్. అఖిలపక్ష భేటీ అనంతరం ఈ నిర్ణయాలు తీసుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
6.'మరికొన్ని నెలల్లో టీకా'
మరికొన్ని నెలల్లో కరోనా టీకా అందుబాటులోకి వస్తుందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ వెల్లడించారు. ఆగస్టు నాటికి 40 లేదా 50 కోట్ల డోసులు అందుబాటులో వస్తాయని పేర్కొన్నారు. ఇప్పటికే టీకా పంపిణీకి సంబంధించిన బ్లూప్రింట్ సిద్ధమవుతోందని, శాస్త్రీయత ఆధారంగా అందరికీ సమాన ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
7.లాఠీఛార్జ్
బంగాల్లో భాజపా కార్యకర్త హత్యకు నిరసనగా ఆ పార్టీ ఇచ్చిన బంద్ పిలుపు ఉద్రిక్తతలకు దారితీసింది. కూచ్‌బెహర్ జిల్లాలోని తుఫాన్గంజ్లో తృణమూల్ కాంగ్రెస్, భాజపా కార్యకర్తలు ఒకరిని ఒకరు దూషించుకున్నారు. అనంతరం ఇరువర్గాలు రాళ్లురువ్వుకోవడం ప్రారంభించాయి. ఈ క్రమంలో పరిస్థితి చేయి దాటుతుంది అని భావించిన పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
8.ఫైజర్ షేర్ల జోరు
దేశీయ స్టాక్ మార్కెట్లలో ఔషధ సంస్థ ఫైజర్ లిమిటెడ్ షేర్లు గురువారం భారీగా లాభాలు గడించాయి. బీఎస్ఈ, ఎన్ఎస్ఈల్లో షేర్లు దాదాపు 4 శాతం పెరిగాయి. కంపెనీ కరోనా టీకా సమర్థంగా పని చేస్తున్నట్లు ఫైజర్ ఇంక్ చేసిన ప్రకటన ఇందుకు కారణం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
9.ప్రత్యర్థి జట్లకు దడ!
ఆస్ట్రేలియాతో పరిమిత ఓవర్ల సిరీస్‌కు రోహిత్ దూరమవ్వడం టీమ్ఇండియాకు నష్టమని అభిప్రాయపడ్డాడు పాక్ మాజీ క్రికెటర్ రమీజ్ రాజా. హిట్‌మ్యాన్ బ్యాట్ పట్టుకుంటే ప్రత్యర్థి జట్లకు దడ అని అన్నాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
10.ఎడారిలో చిత్రీకరణ
ఎడారిలో 27 రోజుల పాటు చిత్రీకరణ.. తాగే నీటి కోసం తిప్పులు.. ప్రతిరోజూ 300 మైళ్ల దూరం నుంచి ట్రక్కుల ద్వారా నీరు తెప్పించుకోవడం తదితర విశేషాలన్ని ఓ తెలుగు సినిమా కోసం జరిగాయి. ఆ సినిమా ఏంటి? అలాంటి పరిస్థితుల్లో ఎందుకు? పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.