ETV Bharat / city

విజేత కావాలంటే చిత్తశుద్ధితో కృషి చేయాలి..!

విజేతలంటే ఎక్కడ నుంచో ఊడిపడిన వాళ్లు కాదు. వాళ్లేమీ ప్రత్యేక లక్షణాలతో పుట్టినవాళ్లు కూడా కాదు. కేవలం ప్రయత్నంతో, పట్టుదలతో పైకొచ్చినవాళ్లే. ఎక్కువమంది భావించేటట్లు అదృష్టం కలిసొస్తే విజేతలం కాలేము. కఠోర శ్రమను నమ్ముకుని, చిత్తశుద్ధితో కృషి చేయడం విజేతల దినచర్యలో ఒక భాగం.

etv bharat special story on winners
విజేతల తీరు ఇదీ...
author img

By

Published : Mar 20, 2021, 4:41 PM IST

సహచరురాలు గొప్ప విజయాన్ని సాధిస్తే ఆమెకు అదృష్టం కలిసొచ్చిందనో, లేదంటే కొన్ని అంశాలు అలా మేలు చేశాయనో భావించేవాళ్లే ఎక్కువ. ఈ విజయం వెనుక దాగి ఉన్న గొప్ప కృషిని గుర్తించేవాళ్లు కొందరే. మనం కూడా వాళ్లలాగే శ్రమిద్దామని కోరుకునేవాళ్లు అతి కొద్దిమందే. విజేతలు కొన్ని అంశాలను పాటిస్తూ ఉంటారు. నిరంతరం లక్ష్యసాధన దిశగా కృషి చేస్తారు. గెలుపోటములు పట్టించుకోరు. కేవలం నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి పనిని చిత్తశుద్ధితో, 100 శాతం ప్రేమ‌తో పూర్తి చేస్తారు. చేస్తున్న పనినే ప్రేమించడం, అందులోనే రిలాక్స్ కావడం విజేతల టెక్నిక్.

* సాధారణంగా ఎక్కువమంది ఉద్యోగులు జీతం కోసమే పనిచేస్తారు. పనిని ఏదో ఒక రకంగా పూర్తి చేసేయాలనే భావనలో ఉంటారు. కానీ విజేతలు అలాకాదు. అప్పజెప్పిన బాధ్యతలను నిబద్ధతతో పూర్తి చేస్తారు. ఆ పనిని ఎలా చేస్తే మరింత పర్‌ఫెక్ట్‌గా రూపొందుతుందో ఆలోచిస్తారు. బాస్ కోసమో, యాజమాన్యం కోసమో, లేదంటే ఎవరైనా గుర్తించాలనో భావించి పనిచేయరు. ఉన్నత ప్రమాణాలు, లక్ష్యాలతో పనిని ప్రారంభిస్తారు. ఇది నా కర్తవ్యం అని ఛాలెంజ్‌గా తీసుకుని చివరికి దాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతారు.
* వృత్తిలో ప్రతి అంశం పట్లా స్పష్టత పెంచుకోవడం విజేతల నైజం. తెలియని విషయాన్ని పక్కన పెట్టేయకుండా దాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేయడం వీరి లక్షణం. చేసే పనికి సంబంధించి అన్ని అంశాల పట్లా స్పష్టత ఉంటేనే దాన్ని ఎలాంటి లోపాలు లేకుండా పూర్తి చేయడం సాధ్యమవుతుంది. విజేతలు అనుసరించే మార్గం ఇదే.

* పనికి సంబంధించి ఫీడ్‌బ్యాక్, విమర్శలు స్వీకరించడానికి విజేతలెప్పుడూ వెనుకాడరు. చేసే పనిలో ఏవైనా లోపాలుంటే ఎప్పటికప్పుడు వాటిని సరిదిద్దుకోవడంలో వీళ్లెప్పుడూ ముందుంటారు.
* నిర్ణీత వేళకే ఆఫీస్‌కి చేరుకోవడం విజేతల లక్షణాల్లో ఒకటి. ప్రతి క్షణాన్నీ పనికోసమే కేటాయిస్తారు. కాలయాపన, అనవసర బాతాఖానీ వీళ్లకు నచ్చదు. పనిలోనే పరమాత్మను చూసుకునే తత్వం విజేతల సొంతం.
* ఎలాంటి లోపాలు లేకుండా గడువులోగా పనిని పూర్తి చేయడం విజేతల స్త్టెల్.
* సంస్థ నిర్వహించే వివిధ శిక్షణ కార్యక్రమాలకు హాజరవ్వడం విజేతల గొప్ప లక్షణం. దీని ద్వారా వివిధ నైపుణ్యాలు మెరుగుపర్చుకోవడం సాధ్యమవుతుంది. ఇలాంటి అవకాశాలను వీరెప్పుడూ జారవిడుచుకోరు. కొత్త విషయాలు నేర్చుకోవడం వీరి లైఫ్‌స్త్టెల్‌లో ఒక భాగం. అదే సాధారణ ఉద్యోగులైతే 'మనకెందుకులే..ఇప్పటికే నేర్చుకున్న స్కిల్స్‌తో బుర్ర వేడెక్కిపోతోంది' అంటూ లైట్‌గా తీసుకుంటారు. దీంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా వీరి పరిస్థితి తయారవుతుంది.

* ఉన్నత వ్యక్తిత్వాన్ని అలవర్చుకోవడం విజేతల నైజం. అనవసర విషయాలకు ప్రాధాన్యం ఇవ్వరు. వాటి జోలికివెళ్లి సమయాన్ని వృథా చేసుకునేంత తీరిక వీరికి ఉండదు. సత్ప్రవర్తన, నీతి, నిజాయతీ, విలువలు, ఉన్నత వ్యక్తిత్వం... ఇలాంటి మంచి లక్షణాలన్నీ విజేతల జీవన విధానంలో ఓ భాగమవుతాయి.
* చేసే పనికి ఎలాంటి ఆటంకాలు కల్పించకుండా బాధ్యతగా విధులు నిర్వహించడం విజేతల తీరు. ఎవరి సమయాన్నీ వృథా చేయరు. వీలైతే సాయం చేయడం వీరి నైజం. సంస్థ నిబంధనలను గౌరవిస్తారు. శక్తి వంచన లేకుండా కృషిచేస్తారు. బాధ్యతలు మోయడానికి వెనుకాడరు. కీలక సందర్భాల్లో మేమున్నామంటూ ముందుకొచ్చి, సమస్యను పరిష్కరిస్తారు.

ఇదీ చదవండి: ఎలక్ట్రానిక్స్ తయారీ గమ్యస్థానంగా తెలంగాణను మారుస్తాం : కేటీఆర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.