ETV Bharat / city

నిద్ర పట్టడం లేదా? ఇలా చేసి చూడండి!

author img

By

Published : Mar 21, 2021, 9:35 PM IST

నేటి ఆధునిక ప్రపంచంలో నిద్రలేని ఒక ప్రధాన సమస్య. ఆ సమస్యను అలాగే వదిలేస్తే ఆరోగ్యం మరింతగా పాడయ్యే ప్రమాదం ఉంటుంది. ఆరోగ్యంగా ఉండటానికి ప్రశాంతమైన నిద్ర చాలా అవసరం. అందుకోసం కొన్ని నియమాల్ని పాటించాలంటున్నారు నిపుణులు 'ప్రపంచ నిద్ర దినోత్సవం' సందర్భంగా ఆ నియమాలేంటో తెలుసుకుందాం రండి..

etv bharat special story on sleeping problems
నిద్ర పట్టడం లేదా? ఇలా చేసి చూడండి!

నిద్రలేమి.. ప్రస్తుతం చాలామంది ఎదుర్కొంటున్న సమస్యల్లో ఇది అతి ముఖ్యమైంది. అయితే పురుషుల్లో కంటే మహిళల్లో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉన్నట్లు కొన్ని అధ్యయనాల్లో వెల్లడైంది. ఒత్తిడి, అనవసరమైన ఆందోళనలు, అతిగా ఆలోచించడం, ఇతర ఆరోగ్య సమస్యలు.. మొదలైనవన్నీ ఇందుకు కారణమవుతున్నాయనేది కొందరి అభిప్రాయం. ప్రశాంతంగా నిద్రపోవాలంటే కొన్ని పద్దతులు పాటించాలంటున్నారు నిపుణులు అవి..

వాతావరణం అనుకూలంగా..

ఆరోగ్యవంతమైన నిద్ర కావాలంటే ముందుగా పడకగది వాతావరణాన్ని మనకు అనుకూలంగా మార్చుకోవాలి. గదిలోకి ఇతర శబ్దాలు వినపడకుండా కిటికీలు, తలుపులు మూసివేయడం, బయటి వాతావరణాన్ని బట్టి గది వాతావరణాన్ని సెట్ చేసుకోవడం, సౌకర్యవంతమైన దుస్తులు ధరించడం, పడుకోవడానికి మంచం, దిండు, పరుపు అనువుగా ఉందో లేదో సరిచూసుకోవడం, మనసుకు ఆహ్లాదం పంచే సంగీతాన్ని మంద్ర స్థాయిలో వినడం, గదిలో వెలుతురు తక్కువగా ఉండేలా చూసుకోవడం, పడక గదికి తగిన వెంటిలేషన్‌ ఉండేలా చూసుకోవడం.. ఇలా పడుకోవడానికి ముందుగానే జాగ్రత్తలన్నీ తీసుకుంటే పడుకున్న తర్వాత నిద్రాభంగం కలగకుండా ఉంటుంది. అలాగే ప్రశాంతంగా, హాయిగా నిద్ర పట్టే అవకాశం కూడా ఉంటుంది.

పడుకునే ముందు..

రోజంతా రకరకాల పనులతో సతమతమయ్యే మహిళలకు విశ్రాంతి దొరికేది రాత్రి పడుకునే సమయంలోనే. అయితే వివిధ పనుల వల్ల కలిగే ఒత్తిళ్లతో వారికి రాత్రుళ్లు నిద్ర సరిగ్గా పట్టకపోవచ్చు. కాబట్టి పడుకునే ముందు గోరువెచ్చటి నీటితో స్నానం చేస్తే శరీరానికి, మనసుకు హాయిగా అనిపించడంతో పాటు ఒత్తిళ్లు కూడా దూరమవుతాయి. తద్వారా నిద్ర కూడా బాగా పట్టే అవకాశం ఉంటుంది.

పొజిషన్ ఛేంజ్!!

చాలామంది మహిళలు బోర్లా పడుకోవడానికి మొగ్గు చూపుతుంటారు. పైగా అలా పడుకోవడం వల్లనే నిద్ర బాగా పడుతుందంటుంటారు. అయితే బోర్లా పడుకోవడం వల్ల ఊపిరితిత్తులపై ఒత్తిడి పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఎడమవైపుకి తిరిగి పడుకోవడం వల్ల గుండెపై ఒత్తిడి పడుతుంది. కాబట్టి పడుకునే పొజిషన్ ఛేంజ్ చేయడం ఉత్తమం. పక్కకు తిరిగి పడుకోవాలంటే కుడివైపుకి లేదా వెల్లకిలా పడుకోవడం మరీ మంచిది. వెల్లకిలా పడుకోవడం వల్ల శరీర అవయవాలు ఒత్తిడి నుంచి ఉపశమనం పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి మహిళలకు వెల్లకిలా పడుకోవడమే ఆరోగ్యవంతమైన నిద్రాస్థితి.

ఒత్తిడి మాయం..

మహిళలు ఇటు ఇంటి పనులు, అటు ఆఫీసు పనుల్ని సమన్వయం చేసుకునే క్రమంలో కొంత ఒత్తిడిని ఎదుర్కోవడం సహజం. అయితే ఇది నిద్రపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ఇలా జరగకుండా ఉండాలంటే ఒత్తిడి నుంచి ఉపశమనం పొందాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇందుకోసం కాసేపు స్విమ్మింగ్, వ్యాయామం, మసాజ్ చేయించుకోవడం.. వంటివి వారి లైఫ్‌స్త్టెల్‌లో భాగం చేసుకోవాలి. తద్వారా శరీరంలోని నరాలకు, కండరాలకు విశ్రాంతి లభించి ఒత్తిడి క్రమంగా దూరమవుతుంది. ఫలితంగా రాత్రుళ్లు చక్కటి నిద్రకు ఉపక్రమించవచ్చు.

వీటికి ‘నో’ ఎంట్రీ!

చాలామంది పడకగదుల్లో టీవీలు, కంప్యూటర్లు అమర్చుకుంటుంటారు. వీటి ధ్యాసలో పడితే అసలు నిద్రే పట్టదు. మరికొంతమందైతే టీవీ చూస్తున్నప్పుడు నిద్ర రాకూడదని స్నాక్స్, బిస్కట్స్ వంటివి లాగించేస్తుంటారు. తద్వారా అటు నిద్రలేమితో ఆరోగ్యం పాడవడమే కాకుండా ఇటు క్యాలరీలు ఎక్కువగా ఉండే స్నాక్స్ తినడం వల్ల బరువు పెరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల ఇలాంటి వాటికి పడకగదిలో చోటివ్వకపోవడమే మంచిది. మీరూ ఈ నియమాలన్నీ పాటిస్తూ హాయిగా నిద్రపోండి.. ఆరోగ్యాన్ని సొంతం చేసుకోండి..

‘గురక’కు చెక్‌ పెట్టేయండిలా!

ఈ రోజుల్లో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, సుఖ నిద్ర కోసం అన్ని సౌకర్యాలున్నా కొందరికి మాత్రం నిద్ర కరువవుతుంది. దానికి పని ఒత్తిళ్లు, ఇతర అనారోగ్యాలే ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చాలామందిలో గురక సమస్య సుఖ నిద్రను దూరం చేస్తుంది. తద్వారా తగినంత ఆక్సిజన్‌ అందక గుండె బరువెక్కి తరచూ అకస్మాత్తుగా మెలకువ వస్తుంది. ఇది క్రమంగా నిద్రలేమికి దారితీస్తుంది. అలాగని ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే అధిక రక్తపోటు, కుంగుబాటు, ఆందోళన, ఊబకాయం, గుండె పోటు, పక్షవాతం, మధుమేహం.. తదితర శారీరక, మానసిక రుగ్మతలు తలెత్తే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. ఈ గురక నుంచి ఎంత త్వరగా బయటపడితే అంత మంచిది. ఇందుకోసం కొన్ని చిట్కాలు పాటిస్తే సరి.

* శరీర బరువు పెరగకుండా ఉండేందుకు రోజూ గంట పాటు వ్యాయామం చేయాలి.
* అధిక రక్తపోటు, గుండె సంబంధిత సమస్యలు, మధుమేహం నియంత్రణలో ఉంచుకోవాలి.
* రాత్రి వేళ తేలికగా జీర్ణమయ్యే ఆహారానికి ప్రాధాన్యమివ్వాలి. ఈ క్రమంలో మాంసాహారం, జంక్‌ఫుడ్‌కు దూరంగా ఉండాలి.
* అలాగే మనం పడుకోవడానికి రెండు గంటల ముందే డిన్నర్‌ని పూర్తిచేసేలా ప్లాన్‌ చేసుకోవాలి. తద్వారా అరుగుదల బాగుంటుంది.. ఎలాంటి పొట్ట సంబంధిత సమస్యలు తలెత్తకుండా సుఖంగా నిద్ర పడుతుంది.

* నిద్రకు 6 గంటల ముందే కెఫీన్‌ కలిసిన కాఫీ, టీ, సోడా.. వంటివాటికి దూరంగా ఉండాలి.

* మద్యపానానికి పూర్తి దూరంగా ఉండాలి.

ఇలాంటి చిట్కాలు పాటిస్తూనే గురక సమస్యను అధిగమించడానికి ప్రస్తుతం అధునాతమైన చికిత్సలు అందుబాటులో ఉన్నాయి.

ఇదీ చదవండి: పర్యావరణాన్ని కాపాడుకోకపోతే గాలి, నీరు దొరకదు: ఇంద్రకరణ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.