ETV Bharat / city

డిసెంబర్- జనవరి నాటికి మార్కెట్లో కరోనా వ్యాక్సిన్ : డా.వేణు కవర్తపు - డిసెంబర్​లో కరోనా వ్యాక్సిన్

ప్రపంచం మీదకు కరోనా మహమ్మారి దండెత్తి పది నెలలు దాటింది. ఎంతోమంది అభాగ్యులను కర్కశంగా పొట్టనబెట్టుకుంది... ఈ మాయదారి వైరస్‌. ప్రపంచాన్ని వణికిస్తున్న వైరస్​ను అంతం చేసేందుకు ఎదురు చూస్తున్నాయి... దేశాలన్నీ. స్తంభించిన జన జీవనం ఇప్పుడిప్పుడే సాధారణ స్థితికి చేరుకునే ప్రయత్నాలు చేస్తున్నా.. మాటు వేసిన కరోనా ఎక్కడో చోట పంజా విసురుతూ... కలవర పెడుతోంది. మరణాన్ని కేవలం అంకెల కూడికలు, తీసివేతలుగా మార్చిన ఈ మహా విషాదానికి అడ్డుకట్ట వేయగల ఒకే ఒక అస్త్రం.. వ్యాక్సిన్‌. ఆ విషయంలో కొద్దినెలలుగా భారీ యజ్ఞమే చేస్తోంది... శాస్త్ర ప్రపంచం. చరిత్రలో ఎప్పుడూ లేనంత వేగంగా కరోనాకు విరుగుడు అందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ పోటీలో ముందుంది.. ఆక్స్‌ఫర్డ్ విశ్వ విద్యాలయం అభివృద్ధి చేస్తోన్న ఆస్ట్రా జెనెకా టీకా. అసలు... వ్యాక్సిన్‌ పురోగతిలో ఎక్కడి వరకు వచ్చాం. ఈ విషయాలపై బ్రిటన్‌ నుంచి ప్రముఖ తెలుగు వైద్యులు.. డాక్టర్‌ వేణు కవర్తపుతో ప్రత్యేక ముఖాముఖి.

etv-bharat-specail-interview-with-dr-venugopal-on-corona-vaccine
డిసెంబర్- జనవరి నాటికి మార్కెట్లో కరోనా వ్యాక్సిన్ : డా.వేణు కవర్తపు
author img

By

Published : Oct 30, 2020, 12:48 AM IST

డిసెంబర్- జనవరి నాటికి మార్కెట్లో కరోనా వ్యాక్సిన్ : డా.వేణు కవర్తపు
  • ప్ర. కరోనాతో ఎంత నష్టం జరిగిందో చూస్తున్నాం.. ప్రపంచమంతా టీకా ఎప్పుడు వస్తుందని ఆసక్తితో చూస్తోంది.. వాక్సిన్ కు మనం ఎంత దూరంలో ఉన్నాం... ?

జ. గడచిన రెండు నెలల్లో వాక్సిన్ తయారీ ప్రక్రియలో చాలా మెరుగుదల ఉంది. అనుకున్న ఫలితాలు వస్తే మరో రెండు నెలల్లో వాక్సిన్ విడుదలవుతుంది. బ్రిటన్​లో అయితే మరో రెండు వారాల్లో పరిమితంగా కొంతమందికి వాక్సిన్ ఇచ్చే అవకాశం ఉంది. డిసెంబర్- జనవరి నాటికి మార్కెట్లోకి వస్తుంది.

  • ప్ర. ఇంతవరకూ ఏ దేశంలోనూ వాక్సిన్ అందుబాటులోకి రాకపోవడానికి కారణమేంటి.. ?

జ. ఇప్పటి వరకూ మనం విరివిగా వాడుతున్న టీకాలు చూస్తే.. వాటి అభివృద్ధికి పదేళ్లు పట్టింది. వాక్సిన్ తయారీకి ముందు .. ఆ వ్యాధిపై అన్వేషణాపథం అని ఉంటుంది. వైరస్​లోని ఏ జన్యుభాగానికి వాక్సిన్ అభివృద్ధి చేయాలన్నది ఆ స్థాయిలో నిర్ణయిస్తారు. దీనికి ఐదేళ్లు పడుతుంది. ఆ తర్వాత ప్రీ క్లినికల్ దశలో వివిధ జంతువులపై పరీక్షిస్తారు. దీనికి కూడా రెండేళ్లు పడుతుంది. ఆ తర్వాత మానవులపై ప్రయోగాలు చేస్తారు. దానిలో కూడా మూడు దశలున్నాయి. ఇవన్నీ దాటుకుని రావడానికి పదేళ్లు పడుతుంది. వాక్సిన్ సురక్షితంగా, ప్రభావవంతంగా తీసుకురావడానికి ఇవన్నీ చేయాలి. లక్షల సంఖ్యలో కేసులు, మరణాలు వస్తున్నప్పుడు ప్రజల్లో అసహనం ఉండటం సహజమే కానీ.. వాక్సిన్ సురక్షితంగా ఉండాలి.. ప్రపంచమంతా ఉపయోగపడాలి కదా..! అందుకే సమయం పడుతుంది

  • ప్ర. ఇంతకు ముందున్న వ్యాధుల పరిస్థితి వేరు... ఇది వేరు కదా...! ఎందుకంటే ఇది మహమ్మారిలా వ్యాపిస్తోంది. అందువల్లనే జంతువుల మీద ప్రయోగాలు లేకుండా నేరుగా మనుషులపైనే క్లినికల్ ట్రయల్స్ కు అనుమతులిచ్చారు కదా..! ఇందుకోసం ఏ విధానాన్ని అవలంబిస్తున్నారు. ?

జ. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఆక్స్​ఫర్డ్ వాక్సిన్ తీసుకుంటే.. కరోనా వైరస్ తరగతికి చెందిన ఇతర వ్యాధులపై ఆక్స్​ఫర్డ్ ఎప్పటి నుంచో ప్రయోగాలు చేస్తోంది. ఆ పరీక్షలన్నీ ఇప్పుడు పనికొస్తున్నాయి. 2014లో ఎబోలా మీద చేసిన ప్రయోగాలు ఇప్పుడు ఉపయోగపడుతున్నాయి. దీనివల్ల చాలా సమయం కలిసొచ్చింది. ముందుగా చేయాల్సిన ప్రయోగశాల పరీక్షలు చేయకుండానే ఆక్స్​ఫర్డ్ కు అనుమతులొచ్చాయి. మిగతా కొన్ని దేశాల్లో ముందుగా చేయాల్సిన అనేక పరీక్షలను చేయకుండానే ముందుకు వెళ్లారు. కానీ ఆక్స్​ఫర్డ్ కు ఇంతకు ముందు నుంచి చేస్తున్న ప్రయోగాలు పనికొచ్చాయి.

  • ప్ర. ప్రయోగశాలల్లో ఏం జరుగుతున్నా కానీ.. ప్రజల్లో మాత్రం వాక్సిన్ ఎప్పుడొస్తుంది. ఎప్పుడు భరోసా వస్తుంది అనే ఉంటుంది. ఆక్స్​ఫర్డ్ ఆస్ట్రాజెనకా వాక్సిన్ ఎప్పుడు బయటకు వస్తుంది.. ?

జ. ఈ వాక్సిన్ మూడోదశ కూడా చివరకు వచ్చింది. ఈ మూడో దశలో ఎక్కువ మంది ప్రజలపై ప్రయోగాలు చేయాలి. ఇది కేవలం ఇంగ్లండ్​లోనే పరీక్షలు చేస్తే ఉపయోగం ఉండదు. అందుకే బ్రిటన్ తో పాటు, సౌతాఫ్రికా, బ్రెజిల్ లో మూడోదశ పరీక్షలు జరుగుతున్నాయి. భారత్ లో సీరం ఇనిస్టిట్యూట్ భాగస్వామ్యంలో జరిగాయి. అవి కూడా పూర్తి కావొస్తున్నాయి. ఈ ఫలితాలను విశ్లేషిస్తున్నారు. ఈ ఫలితాలు సానుకూలంగా ఉంటే.. దాని మీద సమీక్ష లేకుండానే అత్యవసర అనుమతులు కూడా తీసుకోవచ్చు. ఆ ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. రెండు వారాల్లోనే పరిమిత సంఖ్యలో వినియోగానికి అనుమతి రావొచ్చు.

  • ప్ర. ఈ ఏడాది చివరి నాటికి టీకాను తీసుకొస్తామని సీరం సంస్థ ప్రకటించింది.. అది ఎంత వరకు సాధ్యం..?

జ. ఈ ఏడాది చివరి నాటికి కచ్చితంగా వచ్చే అవకాశం ఉంది. ఆక్స్​ఫర్డ్ వాక్సిన్, ఇతర దేశాల్లో వాక్సిన్ అభివృద్ధిపై మాకు ప్రతివారం నేరుగా సమాచారం వస్తుంటుంది. ఏదీ వందశాతం చెప్పలేం. తుది ఫలితాలు విశ్లేషించాకే పూర్తి భరోసా వస్తుంది. అయితే ఇప్పుడు ఉన్న సమాచారం ప్రకారం చూస్తే.. 3-8 వారాల్లో ఈ ప్రక్రియ అంతా పూర్తవుతుంది.

  • ప్ర. వాక్సిన్ వస్తే.. ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలన్నదానిపై ఎలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి...?

జ. బ్రిటన్​లో యంత్రాంగాన్ని సిద్ధం చేస్తున్నారు. భారత్​లో వాక్సిన్ పంపిణీకి సంబంధించిన యంత్రాంగం బాగుంటుంది. ఎందుకంటే అక్కడ ఎప్పటి నుంచో వివిధ రకాల టీకాల పంపిణీ చేపడుతున్నారు. యూరప్, ఇతర దేశాల్లో వ్యవస్థను కొంచెం పునరుద్ధరించుకోవాలి. ఎవరెవరికి.. ఏఏ సమయాల్లో ఇవ్వాలన్న దానిపై ఇప్పటికే ఒక ప్రణాళిక సిద్ధం చేశారు.

  • ప్ర. వాక్సిన్ వచ్చేసింది.. అంతా సిద్ధమని కొన్ని దేశాలు చెబుతున్నాయి. రష్యా అయితే వాక్సిన్ ను విడుదల చేసేసింది. కానీ ప్రపంచ ఆరోగ్య సంస్థ మాత్రం 2021 ద్వితీయార్థంలోనే వాక్సిన్ వచ్చే అవకాశం ఉందని చెబుతోంది...? వాక్సిన్ పై ఎందుకింత గందరగోళం.. ?

జ. ఇది చాలా గందరగోళాన్ని సృష్టిస్తోంది నిజమే.. కొన్ని దేశాలు అత్యవసరం పేరుతో అనుమతులు తీసుకుంటున్నాయి. సంబంధిత అధీకృత సంస్థలకు ఈ ప్రయోగాలకు సంబంధించిన కొద్దిపాటి సమాచారాన్ని మాత్రమే ఇచ్చి అనుమతులు తీసుకుంటున్నాయి. కానీ ఇది అంత సురక్షితం కాదు. ఈ వాక్సిన్​ను మనం ఆరోగ్యవంతమైన వ్యక్తులకు ఇస్తున్నాం. మనం లక్షల మందికి వాక్సిన్ ఇచ్చినప్పుడు.. వారిలో ఒక్కరికి ఏదైనా సమస్య తలెత్తినా చాలా మందికి వ్యాపిస్తుంది. అందుకే వాక్సిన్ విషయంలో అత్యంత జాగ్రత్తలు తీసుకుంటారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలు అత్యున్నతంగా ఉంటాయి. కొన్ని దేశాలు ఆ ప్రమాణాలు పాటిస్తున్నాయి. కొంత మంది పట్టించుకోవడం లేదు. అందుకే ఇన్ని సమస్యలు. కొన్ని చోట్ల రాజకీయాలు కూడా కీలకపాత్ర పోషిస్తున్నాయి. ఆక్స్​ఫర్డ్​తో పాటు.. కొన్ని పెద్ద సంస్థలు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలను కచ్చితంగా పాటిస్తున్నాయి. వాక్సిన్ అభివృద్ధిలో పాలుపంచుకుంటున్న తొమ్మిది పెద్ద సంస్థలు.. వైజ్ఞానిక ప్రమాణాలు పాటిస్తామని ఈమధ్య కాలంలో ప్రమాణం కూడా చేశాయి.

  • ప్రశ్న : ప్రపంచంలోని అతి పెద్ద సంస్థలన్నీ... వాక్సిన్ అభివృద్ధిలో ఉన్నాయి.. ఇవి ఎన్ని రకాల వాక్సిన్లను అభివృద్ధి చేస్తున్నాయి...?

జ. చాలా సంస్థలు పనిచేస్తున్నాయి. నాలుగు రకాల వాక్సిన్లను అభివృద్ధి చేస్తున్నాయి. వైరస్ చుట్టూ ఉండే ప్రొటీన్ స్పైక్ మీద పనిచేసే టీకా ఒక రకం. అలాగే ఆర్ఎన్ఏను నిర్వీర్యం చేసే వాక్సిన్​ను ఫైజర్ సంస్థ అభివృద్ధి చేస్తోంది. కరోనా వైరస్ ను నిద్రావస్తలోకి తీసుకెళ్లి దానిని వాక్సిన్ రూపంలో ఇస్తారు. ఇది యాంటీబాడీలను సృష్టిస్తుంది. రెండు రకాల వైరస్​లను కలిపి వాక్సిన్ చేస్తారు. అయితే ఈ మధ్య చేసిన కొన్ని పరిశోధనల్లో తేలిందేంటంటే.. వైరస్ సోకిన వారికి యాంటీబాడీలు తొందరగా తగ్గిపోతున్నాయి. ఇది ఆందోళనకరం. దీనివల్ల జీవితాంతం రోగ నిరోధకత రాదు. మరో రకమైన నిరోధకత ఏంటంటే.. టీ-సెల్ ఇమ్యూనిటీ. తెల్లరక్తకణాల్లో ఉండే టీ-సెల్స్ వైరస్​కు సంబంధించిన సమాచారాన్ని నిక్షిప్తం చేసుకుంటాయి. భవిష్యత్​లో ఎప్పుడైనా ఈ వ్యాధి మళ్లీ దాడి చేస్తే.. ఈ సమాచారంతో ఎదుర్కొంటాయి. ఇది దీర్ఘకాలికంగా రోగనిరోధకతను ఇస్తుంది. ఇప్పుడు వస్తున్న వాక్సిన్లలో యాంటీబాడీలను ఎక్కువగా ఇస్తున్నవి ఉన్నాయి.. తక్కువుగా ఇస్తున్నవి ఉన్నాయి. యాంటీబాడీల కన్నా కూడా దీర్ఘకాలిక రోగనిరోధకత ఇచ్చేవి ముఖ్యం.

  • ప్రశ్న : వీటిలో ఏది ప్రభావవంతమైనదన్న విషయాన్ని ఎలా నిర్థారిస్తాం.. ?

జ. ఇప్పుడు వాక్సిన్ ప్రయోగాలపై వస్తున్న సమాచారం మొత్తం చాలా తక్కువ వ్యవధికి సంబంధించినది మాత్రమే. నాలుగు వారాల నుంచి.. ఆరునెలల్లోపు ఎలాంటి ఫలితాలు వచ్చాయన్నది మాత్రమే తెలుస్తుంది. దీర్ఘకాలికంగా అది ఎలాంటి ప్రభావం చూపుతుందన్న దానిపై ఎలాంటి పరిశీలన లేదు. ఇప్పుడు ప్రయోగశాలల్లో టీ-సెల్ ఇమ్యూనిటీ ఎక్కువగా ఇచ్చే వాక్సిన్లు మరింత ప్రభావం చూపుతాయి. ఆక్స్​ఫర్డ్ వాక్సిన్ విషయానికి వస్తే.. .యాంటీబాడీలతో పాటు... టీ-సెల్ ఇమ్యూనిటీ కూడా బాగా ఉన్నట్లుగా సమాచారం ఉంది.

  • ప్రశ్న : వాక్సిన్ ఇచ్చాక దాని ప్రభావం ఎంతకాలం ఉంటుంది. అమెరికాలో ఫ్లూ కోసం ప్రతి ఏటా ఇన్​ఫ్లూయెంజా టీకా ఇస్తుంటారు. కరోనా పరిస్థితి కూడా అలాంటిదేనా.. ?

జ. ఇది చాలా ముఖ్యమైన విషయం. కొన్ని నెలలుగా దీనిపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఫ్లూ వైరస్​లో మ్యుటేషన్లు ఎక్కువుగా ఉంటాయి కాబట్టి వాక్సిన్ ను ఎప్పుడూ ఇస్తుండాలి. అయితే అదృష్టవశాత్తూ కరోనా వైరస్​లో మ్యుటేషన్లు మరీ ఎక్కువుగా లేవు. అలాగే దీనిపై అభివృద్ధి చేస్తున్న వాక్సిన్లలో యాంటీబాడీలతో పాటు.. దీర్ఘకాలిక వ్యాధినిరోధకత కూడా ఉంటోంది.

  • ప్రశ్న : ఇన్​ఫ్లూయెంజాలో వాక్సిన్ అభివృద్ధి చేశాక మ్యుటేషన్లు జరిగాయి. కరోనాకు.. వాక్సిన్ అభివృద్ధి దశలోనే మ్యుటేషన్లు ఉంటున్నాయి కాబట్టి.. వాక్సిన్ తయారీపై ఆ ప్రభావం ఉండదా..?

జ. కరోనా వైరస్ కూడా ఇన్​ఫ్లూయెంజా కుటుంబానికి చెందిందే. మ్యుటేషన్ జరిగే అవకాశం ఉంది. అయితే గ్లోబల్ వాక్సినేషన్ కార్యక్రమం ద్వారా దాదాపు 70శాతం జనాభాకు వాక్సిన్ ఇవ్వడం ద్వారా దీనిని పూర్తిగా నిరోధించగలగాలి. అప్పుడు సమస్య ఉండదు. అది జరుగుతుందా లేదా అన్నది ఇప్పుడే చెప్పలేం.

ప్రశ్న : మరో ఆరునెలల్లోనైనా కొన్ని వాక్సిన్లు అయితే ప్రజల్లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.. అయితే వాక్సిన్ డోస్ ఎలా ఉండాలి.. ? అందుబాటులో ఉన్నాయని.. రెండు వాక్సిన్లు కూడా తీసుకోవచ్చా.. అలా తీసుకుంటే దుష్ఫ్రభావాలు ఉంటాయా..?

. చాలా వాక్సిన్లకు బూస్టర్ డోస్ అవసరం. ఆక్స్​ఫర్డ్ వాక్సిన్​కు మొదటి డోస్ ఇచ్చాక నాలుగు వారాల్లో బూస్టర్ డోస్ ఇవ్వాలి. అప్పుడే సరిగ్గా ప్రభావం చూపుతుంది అలాగే కొన్ని వాక్సిన్లు మూడు డోసులు ఇవ్వాల్సి ఉంటుంది. మొదట ఏ వాక్సిన్ అందుబాటులోకి వస్తే దానిని అందరికీ ఇవ్వాలి. దాని ప్రభావం తెలుస్తూ ఉంటుంది. రెండు మూడు వాక్సిన్లను కలిపి తీసుకుంటే ఎలాంటి ప్రభావం ఉంటుంది అనే దానిపై కూడా పరశీలన జరుగుతోంది. ఆ ఫలితాలు వచ్చే వరకూ ఒక వాక్సిన్ మాత్రమే తీసుకోవడం మంచిది.

  • ప్ర. ఇప్పటి వరకూ ముఖ్యమైన వ్యాధులకు సంబంధించి.. వయసుల వారీగా వాక్సిన్లు ఉన్నాయి. కోవిడ్ కు సంబంధించి పిల్లలకు.. పెద్దలకు ఒకే వాక్సిన్ ఉంటుందా.. ?

జ. ప్రస్తుతానికి ఒకే వాక్సిన్ అభివృద్ధి చేస్తున్నారు. రెండో దశ క్లినికల్ ట్రయల్స్ లో అన్ని రకాల వయసుల వారినీ పరీక్షిస్తారు. ఒకవేళ ఏదైనా వయసు వారిపై ప్రయోగాలు చేయకపోతే.. వారికి పూర్తిస్థాయి వాక్సిన్ ఇచ్చేందుకు అనుమతి ఇవ్వరు. ఆక్స్​ఫర్డ్ వాక్సిన్ అన్ని వయసుల వారిపై ప్రయోగాలు చేశారు. దానికి అనుమతి వస్తే.. పిల్లలకు కూడా ఇస్తారు. అయితే ఏ వయసు వారిని చేరుస్తారన్న విషయంపై రెండు వారాల్లో స్పష్టత వస్తుంది.

  • ప్రశ్న : వాక్సిన్ ను వివిధ వయసుల వారిపై.. వివిధ దేశాల్లో పరీక్షిస్తున్నారని చెబుతున్నారు. అన్ని ప్రాంతాల్లో జన్యు అమరిక ఒకేలా ఉండదు. తెల్లవారు, భారతీయులు, ఆఫ్రికన్లు.. ఇలా వివిధ రకాల మనుషుల్లో జన్యువులు వేరే రకంగా ఉంటాయి. ఈ టీకా వివిధ రకాల మనుషుల మీద ఎలా పనిచేస్తుందన్న వివరాలు వచ్చాయా.. ?

జ. ఇది ఆసక్తికరమైన అంశమే. అయితే.. దీనిపై సమాచారం ఇంకా అందుబాటులోకి రాలేదు. ముందుగా వాక్సిన్ సురక్షితమా.. ? కాదా.. ? ప్రభావవంతంగా పనిచేస్తుందా.. లేదా.. అన్న విషయాన్నే చూస్తున్నారు. అది కూడా ముఖ్యంగా వృద్ధుల మీద ఎలా పనిచేస్తుందన్న దానినే పరిశీలిస్తున్నారు. మిగతా విషయాలను విశ్లేషించలేదు.

  • ప్రశ్న : ప్రయోగాల సమయంలో ఒకరు చనిపోయారన్న విషయం బయటకు వచ్చింది. కారణం ఏమై ఉంటుంది.. ?

జ. అది నిజమే.. ! ఆ కారణం వల్లే జాన్సన్ అండ్ జాన్సన్ ప్రయోగాలు నిలిపేసింది. దానికి కొన్ని వారాల ముందు ఆక్స్​ఫర్డ్ ప్రయోగాన్ని కూడా కొన్ని రోజులు నిలిపేశారు. ఒక రోగికి వెన్నుకు సంబంధించిన సమస్య వచ్చింది. వైద్యుల బృందం నిశితంగా పరిశీలించి ఆ సమస్యకు వాక్సిన్ కారణం కాదని నిర్థారించిన తర్వాతనే ప్రయోగాన్ని ముందుకు తీసుకెళ్లారు.

  • ప్రశ్న : ప్రపంచంలోని అన్ని దేశాలు వాక్సిన్ కోసం చూస్తున్నాయి. అందరికీ అవసరం ఉంది. కొన్ని వందల కోట్ల డోసులు అవసరం. మనం అంత ఉత్పత్తి చేయగలుగుతామా.. ? పంపిణీ ఎలా జరగాలి.. ?

జ. ఇది సవాలుతో కూడిన విషయమే.. ! ఓ పదిహేనేళ్ల క్రితమైతే సాధ్యమయ్యేది కాదు. కానీ ఇప్పుడు ఆ యంత్రాంగం, వ్యవస్థ కూడా ఉంది. ఒక వాక్సిన్ మీదే ఆధారపడకుండా.. అందుబాటులోకి వచ్చిన వాక్సిన్లను ఇస్తూ వెళ్లాలి. అందులో కూడా ముందుగా కొవిడ్ విధుల్లో ఉండే వైద్యులు, వైద్య సిబ్బందికి, ఆ తర్వాత ఎక్కువగా వ్యాధికి గురయ్యే అవకాశం ఉన్న వయసుల వారికి ఇస్తూ వెళ్లాలి. మొత్తం మీద రెండేళ్లలో పంపిణీ సాధ్యం అవుతుంది.

ఇవీ చూడండి: దేశంలో 10.65 కోట్లు దాటిన కరోనా టెస్టులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.