మాజీ మంత్రి, భాజపా నేత ఈటల రాజేందర్ (Etela Rajender) బృందం హైదరాబాద్ చేరుకుంది. శంషాబాద్లో ఈటలకు (Etela Rajender).. అభిమానులు ఘన స్వాగతం పలికారు. విమానాశ్రయానికి పెద్ద సంఖ్యలో భాజపా శ్రేణులు తరలిరాగా... పోలీసులు వారికి అనుమతి నిరాకరించారు. ఈ క్రమంలో.. పోలీసులు, భాజపా శ్రేణుల మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది.
సోమవారం భాజపాలో చేరిన ఈటల రాజేందర్ (Etela Rajender).. దిల్లీ నుంచి అనుచరులతో కలిసి విమానంలో బయలుదేరారు. సాంకేతిక లోపం కారణంగా విమానం 2 గంటలు ఆలస్యంగా బయలుదేరింది.
- ఇదీ చదవండి : 'రూల్స్' పాటించమన్నందుకు డీలర్తో ఫైటింగ్