విద్యుదుత్పత్తికి థర్మల్ కేంద్రాల్లో ఎంత బొగ్గు అవసరమో అంచనాలు వేయాలని కేంద్ర విద్యుత్ మండలి(సీఈఏ)కి కేంద్ర విద్యుత్ శాఖ ఆదేశాలు పంపింది. ఉత్పత్తి చేసిన విద్యుత్‌ను ‘భారత ఇంధన ఎక్స్ఛేంజీ’లో అమ్ముకునే థర్మల్ కేంద్రాలు శక్తి-బి’ పథకం కింద బొగ్గును కొంటున్నాయి. వీటికి అమ్మే బొగ్గులో 10 శాతం తప్పనిసరిగా విదేశీ బొగ్గు ఉండాల్సిందేనని కేంద్రం పేర్కొంది. విదేశీ బొగ్గు 10% వాడితే అది మన దేశంలో వాడేదానిలో 15%తో సమానమంది. అయితే తెలంగాణలోని థర్మల్ కేంద్రాలకు విదేశీ బొగ్గు కొనే ప్రసక్తే లేదని రాష్ట్ర జెన్‌కో స్పష్టం చేసింది. సింగరేణి బొగ్గు తక్కువ ధరకు వస్తున్నందున ఎక్కువ ధరకు విదేశీ బొగ్గు ఎందుకు కొనాలని జెన్‌కో వాదిస్తోంది.
ఇవీ చదవండి : బెంబేలెత్తిస్తున్న ప్లాస్టిక్ భూతం.. భారీగా పెరుగుతున్న వినియోగం