ఏపీలోని తిరుమలలో తితిదే ధర్మకర్తల పాలకమండలి రెండు సంవత్సరాల పదవీ కాలం ముగియటంతో ప్రభుత్వం ప్రత్యేక అథారిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.
ఈ ఆదేశాల ప్రకారం తక్షణమే ఈ అథారిటీ అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. ప్రత్యేక అథారిటీ ఛైర్మన్‌గా తితిదే ఈవో, కన్వీనర్‌గా అదనపు ఈవో బాధ్యతలు స్వీకరిస్తారు. తిరుమల తిరుపతి దేవస్థాన పాలకమండలి అధికారాలన్నీ అథారిటీకి ఉంటాయని ఏపీ ప్రభుత్వం తెలిపింది. తితిదే ధర్మకర్తల మండలి రెండు సంవత్సరాల పదవీ కాలం ఈ నెల 21తో ముగిసింది.