Employees Protest: ప్రత్యామ్నాయం లేని పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ.. ఏపీసీపీఎస్ ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిరసన ర్యాలీలు చేపట్టారు. కాకినాడలోని ధర్నాచౌక్ వద్ద ర్యాలీ నిర్వహించిన ఉద్యోగులు.. అంబేడ్కర్ విగ్రహానికి వినతి పత్రం అందించారు. ఎన్నికల సమయంలో జగన్ ఇచ్చిన హామీ మేరకు.. సీపీఎస్ విధానం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం కొత్తగా ప్రతిపాదించిన జీపీఎస్ విధానాన్ని వ్యతిరేకిస్తున్నామని.. ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేస్తామని జగన్ హామీ ఇచ్చి మాట తప్పారంటూ విజయనగరంలో ఉద్యోగులు కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. గుండు చేయించుకుని, చెప్పులతో కొట్టుకుంటూ నిరసన తెలిపారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను నెరవేర్చి.. సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అవలంబించాలని ఏపీసీపీఎస్ఈఏ గుంటూరు జిల్లా అధ్యక్షురాలు కల్పన అన్నారు. గుంటూరు జిల్లా తెనాలి రైల్వే స్టేషన్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించి నిరసన వ్యక్తం చేశారు. జీపీఎస్ అనే కొత్త విధానాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు ఆమె తెలిపారు.
ఇదీ చూడండి: రూ.1439 కోట్ల విలువైన హెరాయిన్ పట్టివేత