ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు ఆసుపత్రిలో రోగుల నుంచి మంగళగిరి ఎయిమ్స్ వైద్యులు నమూనాలను సేకరించారు. ఎయిమ్స్ సూపరింటెండెంట్ డా.రాకేష్ కక్కర్ నేతృత్వంలో ఐదుగురు వైద్యుల బృందం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి వెళ్లి రోగులను పరిశీలించారు. వారి నుంచి రక్తం, యూరిన్, సీఎఫ్ఎస్ నమూనాలను సేకరించారు.
ఎయిర్ కార్గో ద్వారా దిల్లీలోని ఎయిమ్స్‌కు పరీక్షల నిమిత్తం నమూనాలను తరలించారు. 24 గంటల్లో ఫలితాలు వచ్చే అవకాశముందని వైద్యులు తెలిపారు. కమ్యూనిటీ మెడిసిన్, క్రిటికల్ కేర్ యూనిట్, వైరాలజీ, మైక్రో బయాలజీకి చెందిన నిపుణుల బృందం ఏలూరు రోగులను పరిశీలించింది.
ఇదీ చదవండి: మరింత తగ్గిన బంగారం, వెండి ధరలు