ETV Bharat / city

Electrical Buses in AP: ఏపీలో 'ఈ- బస్సులు'.. ఈ ఏడాదిలోనే..! - ఏపీలో ఈ బస్సులు

Electrical Buses in AP: రోజురోజుకీ వాతావరణ కాలుష్యం పెరిగిపోతుండటంతో.. దేశవ్యాప్తంగా కాలుష్య రహిత ఎలక్ట్రికల్ వాహనాలు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం ఆశయంగా పెట్టుకుంది.ఈ లక్ష్య సాధన దిశలో భాగంగా ఏపీకి 350 ఎలక్ట్రికల్ బస్సులు మంజూరయ్యాయి. 6 ప్రధాన నగరాలకు 50 నుంచి 100 వరకు.. ఈ- బస్సులు కేటాయించారు. ఇక ఈ ఏడాదిలోనే అవి రోడ్డెక్కనున్నాయి. బస్టాండుల్లో ఛార్జింగ్ పాయింట్ల ఏర్పాటుకు కూడా సన్నాహాలు జరుగుతున్నాయి.

Electrical Buses in AP
ఏపీలో ఈ బస్సులు
author img

By

Published : Jan 27, 2022, 4:52 PM IST

Electrical Buses in AP: దేశంలో చాలావరకు కాలం చెల్లిన బస్సులు కావడంతో... వాటి నుంచి వెలువడే పొగ కాలుష్యానికి కారణమవుతోంది. దీనికి చెక్‌ పెట్టేందుకు పర్యావరణహిత వాహనాలను అందుబాటులోకి తేవాలని కేంద్రం నిర్దేశించింది. అన్ని రాష్ట్రాలకు ఎలక్ట్రిక్ బస్సులు ఇవ్వాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా మొదటి విడతలో దిల్లీకి ఈ- బస్సులు కేటాయించగా, రెండో విడతలో ఏపీకి 350 ఎలక్ట్రికల్ బస్సులు మంజూరు చేసింది. వీటిలో విశాఖకు వంద, విజయవాడ, గుంటూరు, కాకినాడ, తిరుపతి, అలిపిరి డిపోలకు 50 చొప్పున బస్సులు కేటాయించారు.

ఏపీలో తిరగనున్న ఈ- బస్సులు

టెండర్లు పూర్తి

బహుళజాతి పరిశ్రమల విభాగం కింద.. ఈ- బస్సులను కేటాయిస్తున్నారు. రాష్ట్రానికి కేటాయించే 350 బస్సులపై.. డీహెచ్ఐ- కేంద్ర ప్రభుత్వం మధ్య ఒప్పందం కుదిరింది. ప్రస్తుతం తిరుపతి ఇంటర్ సిటీ, తిరుమల ఘాట్ వరకు తిప్పే 100 బస్సులకు టెండర్లు పూర్తయ్యాయి. ఎవే ట్రాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి చెందిన ఏసీ బస్సులను.. అద్దె రూపంలో తిప్పేందుకు టెండర్లు దక్కించుకుంది.

" పర్యావరణ పరిరక్షణ కోసం ఈ ఈ-బస్సులు రాష్ట్రానికి మంజూరయ్యాయి. మొత్తం 350 బస్సుల్లో విశాఖకు వంద, విజయవాడ, గుంటూరు, కాకినాడ, తిరుపతి, అలిపిరి డిపోలకు 50 చొప్పున బస్సులు కేటాయించారు. కిలోమీటరుకు రూ.38.19పై. మేము చెల్లిస్తాము. ఇది మాకు, ఎవే ట్రాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి మధ్య ఒప్పందం. వచ్చే నవంబర్ వరకూ తిరుమల ఘాట్ వరకూ తిప్పే వంద బస్సులు సర్వీసులు అందించేలా ఏర్పాట్లు చేస్తున్నాం. తర్వాత ఫేజ్​లో మిగిలిన నగరాల్లో ఈ- బస్సుల సేవలకు టెండర్ల కోసం సన్నాహాలు చేయనున్నాం" - మల్లికార్జునరెడ్డి, ఏపీఎస్ఆర్టీసీ ఛైర్మన్

స్థల సేకరణ పూర్తి

ఎలక్ట్రిక్​ బస్సులకు కావాల్సిన ఛార్జింగ్ పాయింట్లను బస్టాండుల్లో పెట్టే విధంగా ఏపీఎస్​ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే స్థలసేకరణ పూర్తయింది. అలిపిరి బస్టాండ్‌లో 100 ఛార్జింగ్ పాయింట్లు నిర్మించే దిశగా కసరత్తు జరుగుతోంది. నవంబరులోగా ఈ- బస్సులు రోడ్లపైకి వచ్చేలా ప్రణాళిక రూపొందించారు.

" తిరుమల ఘాట్ వరకూ తిరిగే వంద బస్సులకు ఛార్జింగ్ పాయింట్లను తిరుపతి, తిరుమల, నెల్లూరు, మదనపల్లి, కడప ఏర్పాటు చేస్తున్నాం. పాయింట్లు ఎక్కడెక్కడ అవసరం, ఎన్ని కిలోమీటర్లకు అవసరం అని వారు చెప్తే మేము స్థలాన్ని కేటాయిస్తాము. " -మల్లికార్జునరెడ్డి, ఏపీఎస్ఆర్టీసీ ఛైర్మన్

ఈ-బస్సులన్నీ ఏసీ బస్సులు కావడంతోపాటు.. చాలా సున్నితంగా.. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలు చేర్చేందుకు ఉపయోగపడతాయని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

ఇదీ చదవండి : మహేష్​బ్యాంక్​ హ్యాకింగ్​ కేసులో పురోగతి.. ఆ డబ్బులు ఎవరి ఖాతాలకు వెళ్లాయంటే..?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.