ETV Bharat / city

24న పీఓ, ఏపీఓలకు ఎన్నికల శిక్షణ : జీహెచ్​ఎంసీ కమిషనర్

జీహెచ్​ఎంసీ ఎన్నికల పోలింగ్​లో విధులు నిర్వహించనున్న పీఓ, ఏపీఓలకు మంగళవారం ఎన్నికల శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు బల్దియా కమిషనర్ లోకేశ్ కుమార్ తెలిపారు. 21వేల సిబ్బందికి శిక్షణ ఇవ్వనున్నట్లు వెల్లడించారు.

election training for po and apos for ghmc elections 2020
జీహెచ్​ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్
author img

By

Published : Nov 23, 2020, 1:44 PM IST

జీహెచ్​ఎంసీ ఎన్నికలకు పీఓ, ఏపీఓలకు మంగళవారం రోజు ఎన్నికల శిక్షణ ఇవ్వనున్నట్లు కమిషనర్ లోకేశ్ కుమార్ తెలిపారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన 21వేల మంది పీఓ, ఏపీఓలకు శిక్షణ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. శిక్షణ ఇచ్చేందుకు 166 మాస్టర్ ట్రైనీలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

మంగళవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు.. మధ్యాహ్ననం 2 గంటల నుంచి 4 గంటల వరకు శిక్షణ ఇవ్వనున్నట్లు కమిషనర్ తెలిపారు. శిక్షణకు ఎవరైనా గైర్హాజరైతే.. తదుపరి రోజు వారికి శిక్షణ ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. ఎన్నికల విధులకు గైర్హాజరయ్యే వారిపై.. ఎన్నికల నిబంధనల ప్రకారం క్రమశిక్షణా చర్యలు చేపడతామని లోకేశ్ కుమార్ వివరించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.