రాజేంద్రనగర్లో మున్సిపల్ ఓట్ల లెక్కింపు కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. నియోజకవర్గంలోని బండ్లగూడ జాగిర్ కార్పొరేషన్, మణికొండ, నార్సింగి, శంషాబాద్ మున్సిపాలిటీల ఓట్ల లెక్కింపును లార్డ్స్ ఇంజినీరింగ్ కళాశాలలో చేపట్టనున్నట్లు వెల్లడించారు. రేపు ఉదయం ఎనిమిది గంటలకు కౌంటింగ్ ప్రారంభమై...మధ్యాహ్నం లోపు ఫలితాలు వెలువడతాయని అధికారులు పేర్కొన్నారు.
ఇవీ చూడండి : పుర ఫలితాల్లో విజయఢంకా మోగిస్తాం: పల్లా