ఓటర్ల నమోదు, పోలింగ్ కేంద్రాల మార్పు తదితర అంశాలపై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో ఎన్నికల విభాగం అదనపు కమిషనర్ ఎస్ పంకజ చర్చించారు. తెరాస నుంచి ఎం.శ్రీనివాస్‌రెడ్డి, ఎస్.భరత్‌కుమార్, భాజపా నుంచి పొన్న వెంకటరమణ, కొల్లూరు పవన్‌కుమార్, కాంగ్రెస్ నుంచి మర్రి శశిధర్‌రెడ్డి, జి.నిరంజన్, పి.రాజేష్‌కుమార్, ఎంఐఎం నుంచి సయ్యద్ ముస్తాక్ అహ్మద్, తెదేపా నుంచి రాజా చౌదరి, రామచంద్రాచారి, సీపీఎం నుంచి ఎం.శ్రీనివాసరావు, సీపీఐ నుంచి ఎన్.శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
జనవరి 1 ప్రామాణికం..
వచ్చే ఏడాది జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండేవారు ఓటుహక్కు నమోదు చేసుకోవచ్చని అదనపు కమిషనర్ తెలిపారు. అదే ఏడాది 15 నాటికి ఓటర్ల తుది జాబితా విడుదల చేస్తామన్నారు. ఈ నెలాఖరులోపు పోలింగ్ కేంద్రాల మార్పు, హద్దుల సవరణపై ఆమోద ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయించారు. దీనిపై అన్ని రాజకీయపార్టీల అభిప్రాయాలు కోరారు. నియోజకవర్గాల వారీగా ఎన్నికల అధికారుల ఆధ్వర్యంలో సోమవారం మరోసారి సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. అధికారులు మార్చాలని చూస్తున్న పోలింగ్ కేంద్రాలు ఎక్కువగా పాతబస్తీకి చెందినవి కావడంపై నగర భాజపా ప్రతినిధులు అభ్యంతరం తెలిపారు.
ఇవీ చూడండి: దుబ్బాక పోరు: అభ్యర్థి ఎంపికకు కాంగ్రెస్ కసరత్తు