ETV Bharat / city

CEO Shashank Goyal: సీఈవో శశాంక్​ గోయల్​ను రిలీవ్​ చేసేందుకు ఈసీ అనుమతి - తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి

CEO Shashank Goyal: గోయల్​ను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి బాధ్యతల నుంచి రిలీవ్ చేసేందుకు ఈసీ అనుమతించింది. రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం పంపింది. అదనపు సీఈఓ జ్యోతి బుద్ధ ప్రకాశ్​ను ఇన్​ఛార్జి సీఈఓగా నియమించింది.

ts Ceo Shashank Goyal
Shashank Goyal
author img

By

Published : Feb 10, 2022, 10:38 PM IST

CEO Shashank Goyal: రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్​ను రిలీవ్ చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతించింది. శశాంక్ గోయల్ డిప్యుటేషన్​పై కేంద్ర కార్మికశాఖ అదనపు కార్యదర్శిగా నియమితులయ్యారు. కేబినెట్ నియామకాల కమిటీ గత నెల 18న నిర్ణయం తీసుకొంది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీచేసింది. అయినా అప్పటి నుంచి ఆయన సీఈఓ విధుల నుంచి రిలీవ్ కాలేదు. తాజాగా గోయల్​ను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి బాధ్యతల నుంచి రిలీవ్ చేసేందుకు అనుమతించిన ఈసీ... ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం పంపింది.

శశాంక్ గోయల్ రిలీవ్ నేపథ్యంలో అదనపు సీఈఓ జ్యోతి బుద్ధ ప్రకాశ్​ను ఇన్​ఛార్జి సీఈఓగా నియమించింది. శశాంక్ గోయల్​ను రాష్ట్ర ప్రభుత్వం రిలీవ్ చేశాక జ్యోతి బుద్ధ ప్రకాశ్​కు బాధ్యతలు అప్పగిస్తారు. అటు కొత్త సీఈఓ కోసం రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురు అధికారుల పేర్లను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపాల్సి ఉంది.

ఇదీచూడండి: Shashank Goyal transferred: రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ బదిలీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.