తిరుమల శ్రీవారి ఆలయ అర్చకులుగా మిరాశీ కుటుంబాలకు చెందిన 8 మంది యువకులు బాధ్యతలు చేపట్టారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు వంశపారంపర్య అర్చకులకు.. వారసత్వపు హక్కులు కల్పించడంలో భాగంగా ఇటీవల మిరాశీ కుటుంబాలకు చెందిన 8 మంది యువకులను అర్చకులుగా తితిదే నియమించింది.
పైడిపల్లి కుటుంబం నుంచి ఏఎస్పీఎన్ దీక్షితులు, గొల్లపల్లి కుటుంబం నుంచి ఏఎస్ కేఆర్‌సీ దీక్షితులు, ఏఎస్ కృష్ణచంద్ర దీక్షితులు, ఏఎస్ భరద్వాజ దీక్షితులు, తిరుపతమ్మ కుటుంబం నుంచి ఏటీ శ్రీనివాస దీక్షితులు, ఏటీఆర్ రాహుల్ దీక్షితులు, ఏ. ప్రశాంత్ దీక్షితులు, ఏటీ శ్రీహర్ష శ్రీనివాస దీక్షితులు ఆలయంలోకి వెళ్లి శ్రీవారిని దర్శించుకుని అర్చకులుగా బాధ్యతలు తీసుకున్నారు.
ఈ నియామకాలు మీరాశీ కుటుంబాలకు మరపురాని అంశమని ప్రధాన అర్చకులు కృష్ణశేషాచల దీక్షితులు అన్నారు. వంశపారంపర్యంగా వస్తున్న హక్కులు కల్పిస్తూ అర్చకులను రెగ్యులర్ చేయడంపై హర్షం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: 'కాంగ్రెస్ లేకుండా ప్రత్యామ్నాయ కూటమి అసాధ్యం'