ఈనాడు క్రికెట్ లీగ్ పోటీలు మేడ్చల్ మైసమ్మగూడలోని మల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో హోరాహోరీగా కొనసాగుతున్నాయి. సీనియర్ విభాగంలో రెండు మ్యాచ్లు జరిగాయి. తెలంగాణ టైగర్స్, సెంట్రల్ ఆంధ్ర తలపడగా సెంట్రల్ ఆంధ్ర జట్టు గెలుపొందింది. మరో మ్యాచ్లో హైదరాబాద్ హీరోస్.. రాయలసీమ రాకర్స్ను ఓడించింది.
జూనియర్ విభాగంలో రెండు మ్యాచ్లు జరిగాయి. మొదటి మ్యాచ్లో తెలంగాణ టైగర్స్, సెంట్రల్ ఆంధ్ర టీమ్లు తలపడగా సెంట్రల్ ఆంధ్ర టీం విజయం సాధించింది. మరో మ్యాచులో రాయలసీమ రాకర్స్పై... హైదరాబాద్ హీరోస్ జయకేతనం ఎగరవేసింది. ఇక మహిళల విభాగంలో హైదరాబాద్ హీరోస్, రాయలసీమ రాకర్స్ జట్లు విజయం సాధించాయి.
ఇవీ చూడండి: ప్లాస్టిక్ నుంచి పేపర్ సంచికి మారుదాం...