ETV Bharat / city

black fungus: ఏపీలో చాపకింద నీరులా ఫంగస్.. పదుల సంఖ్యలో కేసులు - జిల్లాల్లో నమోదైన బ్లాక్ ఫంగస్ కేసులు వివరాలు

ఏపీలో బ్లాక్‌ ఫంగస్‌ చాపకింద నీరులా విస్తరిస్తోంది. రోజుకు పదులు సంఖ్యలో బ్లాక్​ ఫంగస్ భారిన పడుతుండటం ఆందోళన రేకెత్తిస్తోంది. ఫంగస్​ భారిన పడ్డవారిలో ఎక్కువగా కరోనా నుంచి కోలుకున్నవారే కావటం వల్ల ప్రభుత్వ ఆసుపత్రుల్లోని వైద్యులు అప్రమత్తమయ్యారు.

black fungus cases latest news update
black fungus cases latest news update
author img

By

Published : May 27, 2021, 8:36 AM IST

ఆంధ్రప్రదేశ్​లోని జిల్లాల్లో బ్లాక్‌ ఫంగస్‌ చాపకింద నీరులా విస్తరిస్తోంది. బుధవారం ఒక్క రోజే అనంతపురం జిల్లాలో 17 మంది వ్యాధి లక్షణాలతో సర్వజనాస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఇక్కడ 62 మంది బ్లాక్‌ ఫంగస్‌తో చికిత్స పొందుతున్నారు. వైద్యులు నలుగురికి శస్త్ర చికిత్సలు చేశారు. చిత్తూరు జిల్లాలోనూ రోజురోజుకు కేసులు పెరుగుతున్నాయి. జిల్లా పరిధిలో బుధవారం నాటికి 53 కేసులు నమోదైనట్లు అధికారులు చెబుతున్నారు.

రుయా ఆసుపత్రిలో 28 మంది చేరగా, స్విమ్స్‌లో 25 మంది చికిత్స పొందుతున్నారు. అవసరమైన వారికి యాంఫొటెరిసిన్‌ బి ఇంజక్షన్లు ఇస్తున్నారు. రుయాలో ఇద్దరికి, స్విమ్స్‌లో ఒకరికి శస్త్రచికిత్స చేశారు. ముగ్గురు బాధితుల ఆరోగ్యం బాగా మెరుగుపడిందని వైద్యాధికారులు స్పష్టం చేశారు.

తూర్పు గోదావరి జిల్లా కాకినాడ జీజీహెచ్‌లో బుధవారం నాటికి 47 మంది చికిత్స పొందుతున్నారని సూపరింటెండెంట్‌ డా.ఆర్‌.మహాలక్ష్మి తెలిపారు. వీరిలో 40 మంది కొవిడ్‌ నుంచి కోలుకున్న తరువాత ఫంగస్‌ బారిన పడ్డారన్నారు.

గుంటూరు జిల్లా చేబ్రోలులోని ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న మంగల నాయక్‌ (57) బ్లాక్‌ ఫంగస్‌తో మంగళవారం రాత్రి మృతిచెందారు. గుంటూరులో ఉంటున్న ఆయన ఇటీవలే కొవిడ్‌ నుంచి కోలుకున్నారు.

ఇవీ చూడండి:

Black Fungus: మోతాదుకు మించి స్టెరాయిడ్ల వినియోగం'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.