Schools Reopened in Telangana: తెలంగాణలో మళ్లీ బడి గంట మోగింది. ఉదయాన్నే లేచి విద్యార్థులంతా తమతమ పాఠశాలలు, కళాశాలలకు వచ్చారు. నిన్నటి మొన్నటి వరకు వెలవెలబోయిన బస్టాపులు, విద్యాసంస్థలు నేడు విద్యార్థులతో కళకళలాడుతున్నాయి. ఒకటో తరగతి పిల్లాడి నుంచి పీజీ చదివే కుర్రాడి వరకూ.. అందరి తల్లిదండ్రులు తమ పిల్లలకు జాగ్రత్తలు చెప్పి పంపిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ముఖం మీద నుంచి మాస్కు తీయొద్దని.. తరచూ శానిటైజర్ రాసుకోవాలని.. ఎవరితో దగ్గరగా ఉండకుండా.. భౌతిక దూరం పాటించాలని మరీ మరీ చెబుతున్నారు.
Educational Institutions Reopened in Telangana: సంక్రాంతి సెలవుల్లో భాగంగా జనవరి 8 నుంచి విద్యాసంస్థలన్నీ మూతపడగా.. కరోనా కారణంగా సెలవులను 31 వరకు పొడిగిస్తూ వచ్చారు. మళ్లీ వాటిని తెరిచేందుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపడంతో మొత్తం సర్కారు బడులు, అధిక శాతం ప్రైవేట్ పాఠశాలలు ప్రత్యక్ష తరగతులు ప్రారంభించాయి. విశ్వవిద్యాలయాలూ ప్రత్యక్ష తరగతులను మొదలుపెట్టాయి. హైదరాబాద్‌లో మాత్రం కొన్ని సీబీఎస్‌ఈ పాఠశాలలు ఈనెల 2 నుంచి ప్రారంభిస్తామని తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వగా.. మరికొన్ని కొద్దిరోజులపాటు ఆన్‌లైన్ తరగతులు జరపాలని నిర్ణయించాయి.
అప్పటి మార్గదర్శకాలేనా?
Corona Rules in Telangana Schools : కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రత్యక్ష తరగతులు జరపాలని పాఠశాల విద్యాశాఖ పేర్కొంది. ఆ నిబంధనలు ఏమిటో తాజాగా చెప్పలేదు. గత సెప్టెంబరులో హైకోర్టు ఆదేశాల మేరకు పాఠశాల విద్యాశాఖ జారీ చేసిన మార్గదర్శకాలనే అనుసరించాలని యాజమాన్యాలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
- ఇదీ చదవండి : 2 లక్షల దిగువకు కరోనా కేసులు- భారీగా పెరిగిన మరణాలు