ప్రతి ఒక్కరూ యోగాను దినచర్యలో భాగం చేసుకోవాలని విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి సూచించారు. మానసిక ప్రశాంతతోపాటు.. పనిపై శ్రద్ధ పెరుగుతుందని తెలిపారు. భారతీయ యోగా సంస్థాన్ 53వ వార్షికోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. భారతీయ యోగ సంస్థాన్ వార్షికోత్సవం సందర్భంగా మాసబ్ ట్యాంకులోని నెహ్రూ పార్కులో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.
ఇవీచూడండి: భారతీయ యోగా సంస్థాన్ ఆధ్వర్యంలో వేడుకలు