అగ్రిగోల్డ్ నిందితులను 10 రోజుల ఈడీ కస్టడీకి కోర్టు అనుమతించింది. ఈ నెల 27 నుంచి జనవరి 5వరకు అగ్రిగోల్డ్ ఛైర్మన్ అవ్వా వెంకటరామారావు, ప్రమోటర్లు శేషునారాయణరావు, హేమసుందర వరప్రసాద్ ఈడీ కస్టడీలో ఉండనున్నారు. ప్రస్తుతం చంచల్గూడా జైలులో ఉన్న ముగ్గురు నిందితులకు ప్రత్యేక న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే.
నమోదైన కేసుల ఆధారంగా..
మనీలాండరింగ్ చట్టం కింద అగ్రిగోల్డ్‌పై దర్యాప్తు చేస్తున్న ఈడీ.. ఏపీ, తెలంగాణ, కర్ణాటకలో నమోదైన కేసుల ఆధారంగా దర్యాప్తు చేపట్టింది. అగ్రిగోల్డ్ 32 లక్షల మందిని రూ.6380 కోట్ల మోసం చేసిందని పేర్కొన్న ఈడీ.. రూ.942 కోట్ల డిపాజిటర్ల సొమ్మును ఇతర వ్యాపారాలకు మళ్లించినట్లు గుర్తించింది. గత సోదాల్లో రూ.22 లక్షల నగదుతో పాటు పలు కీలక దస్త్రాలు స్వాధీనం చేసుకుంది. వీటన్నింటిని గురించి ముగ్గురు నిందితులను ఈ నెల 27 నుంచి ఈడీ ప్రశ్నించనుంది.
సంబంధిత కథనం: కేమన్ ఐలండ్స్‌లో అగ్రిగోల్డ్ సొమ్ము..!