ETV Bharat / city

నేటి నుంచి ఎంసెట్​ తుది విడత కౌన్సిలింగ్​.. 12న సీట్ల కేటాయింపు

నేటి నుంచి ఎంసెట్​ చివరి విడత కౌన్సిలింగ్​ ప్రారంభం కానుంది. ఇంటర్​ పాసైన విద్యార్థులు ఎంసెట్​ కౌన్సిలింగ్​కి హాజరు కావొచ్చనే ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం తుది విడత కౌన్సిలింగ్​ కాల పట్టికను అధికారులు సవరించారు. రేపటి నుంచి ధ్రువపత్రాల పరిశీలన ఉండగా ఈ రోజు స్లాట్​ బుక్​ చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు.

eamcet final term counselling from today
నేటి నుంచి ఎంసెట్​ తుది విడత కౌన్సిలింగ్​.. 12న సీట్ల కేటాయింపు
author img

By

Published : Nov 7, 2020, 7:21 AM IST

ఎంసెట్‌ కౌన్సెలింగ్‌కు ఇంటర్‌ పాసైతే చాలని ప్రభుత్వం ఇటీవల జీఓ జారీ చేయడం, పరీక్షలు రాయని విద్యార్థులను కూడా ఉత్తీర్ణులు చేయడం తదితర కారణాలతో ఎంసెట్‌ తుది విడత కౌన్సిలింగ్‌ కాలపట్టికను అధికారులు సవరించారు. చివరి విడత కౌన్సెలింగ్‌లో భాగంగా వెబ్‌ ఆప్షన్ల ప్రక్రియ గత నెల 30వ తేదీ నుంచే మొదలవ్వగా... కొత్త విద్యార్థులు ధ్రువపత్రాల పరిశీలన కోసం శనివారం స్లాట్లు బుక్‌ చేసుకోవచ్చు.

9వ తేదీ వరకు వెబ్​ ఆప్షన్లు

ఈ నెల 8న ఆయా సహాయ కేంద్రాల్లో ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది. 9వ తేదీ వరకు వెబ్‌ ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. ఈ నెల 12న చివర విడత సీట్ల కేటాయింపు జరగనుంది. విద్యార్థులు 12 నుంచి 17వ తేదీ వరకు కళాశాలల్లో ఫీజులు చెల్లించి సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేయాలి. ప్రైవేట్‌ కళాశాలల్లో స్పాట్‌ ప్రవేశాలకు మార్గదర్శకాలను ఈ నెల 14న వెబ్‌సైట్‌లో ఉంచుతామని ఎంసెట్‌ క్యాంపు అధికారి బి. శ్రీనివాస్‌ తెలిపారు.

84 మందికి కొత్తగా ర్యాంకులు

గత మార్చిలో జరిగిన ఇంటర్‌ పరీక్షలకు ఫీజు చెల్లించి పరీక్షలు రాయని 27,589 మంది ద్వితీయ సంవత్సరం విద్యార్థులను ప్రభుత్వం ఉత్తీర్ణులను చేసిన నేపథ్యంలో వారిలో ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ రాసిన ఎంపీసీ విద్యార్థులు 84 మందికి కొత్తగా ర్యాంకులు కేటాయించారు. ఆ వివరాలను ఎంసెట్‌ క్యాంపు కార్యాలయానికి పంపారు. ఇంకా ఎంసెట్‌ అగ్రికల్చర్‌లో మరో 38 మంది ఉన్నారు.

ఇదీ చదవండి: పోలీస్​ శాఖకు చెందిన ఆస్తులను డాక్యుమెంటేషన్​ పూర్తి: డీజీపీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.