పరీక్ష కేంద్రం మార్చుకునేందుకు అవకాశం కల్పించినట్టు ఎంసెట్ కన్వీనర్ ప్రకటించారు. పరీక్ష కేంద్రాన్ని ఏపీకి మార్చుకునేందుకు రేపటి వరకు గడువిచ్చారు. రెండో విడతలే ఏపీ నుంచి తెలంగాణకు మార్చుకునే అవకాశం ఇచ్చినట్టు వెల్లడించారు. eamcet.tsche.ac.in వెబ్‌సైట్ ద్వారా మార్చుకోవాలని సూచించారు.
కరోనా తీవ్రతతో పరీక్షలు ఎప్పుడు నిర్వహించాలనే అంశం ఇంకా స్పష్టత రాలేదు. షెడ్యూల్ ప్రకారం మే 31 వరకే పరీక్ష జరగాల్సి ఉన్నా.. నిరవధికంగా వాయిదా వేశారు. కొవిడ్ తీవ్రత తగ్గిన తరువాతే పరీక్ష నిర్వహించే అవకాశముంది.
ఇవీ చూడండి: శత్రువులు చుట్టుముట్టినా... సింహంలా గర్జించాడు..!