ETV Bharat / city

ఏపీ​లోకి ప్రవేశించే ప్రయాణికులు ఈ-పాస్​ తప్పనిసరి

కర్ఫ్యూ సమయంలో ఆంధ్రప్రదేశ్​లోకి ప్రవేశించే ప్రయాణికులు తప్పనిసరిగా ఈ-పాస్​ను కలిగి ఉండాలని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం పేర్కొన్న అత్యవసర సేవలకు ఈ-పాస్ అవసరం లేదన్నారు.

e-pass mandatory for entry in andhrapradhesh
ఏపీ​లోకి ప్రవేశించే ప్రయాణికులు ఈ-పాస్​ తప్పనిసరి
author img

By

Published : May 25, 2021, 4:10 AM IST

ఇతర రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్​కు రావాలంటే ఈ-పాస్ తప్పనిసరి అని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. ఉదయం 6గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఏపీలోకి వచ్చే వారికి ఈ-పాస్ లు అవసరం లేదన్న డీజీపీ... మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఏపీలోకి వచ్చే ప్రయాణికులు ఈ-పాస్​ను కచ్చితంగా కలిగి ఉండాలని స్పష్టం చేశారు. సంబంధిత ప్రభుత్వ వెబ్​సైట్ల ద్వారా ఈ-పాస్​ను పొందవచ్చని తెలిపారు. ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం పేర్కొన్న అత్యవసర సేవలకు ఈ-పాస్ అవసరం లేదన్నారు.

ఆంధ్రప్రదేశ్​కు పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, తమిళనాడు, ఒడిశా, కర్ణాటకల్లో కర్ఫ్యూ.. లాక్​డౌన్ అమలులో ఉన్నందున ఆయా రాష్ట్రాల్లోకి ప్రవేశించాలంటే సంబంధిత రాష్ట్రాలు జారీ చేసిన ఈ-పాస్​ను కలిగి ఉండాలని సూచించారు. ఇతర రాష్ట్రాలకు అంబులెన్స్​లో ప్రయాణించే వారికి ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ద్వారా సహాయసహకారాలు అందిస్తామని డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు.

సంబంధిత కథనం: ఈ-పాసుల తిరస్కరణపై ట్విట్టర్​లో డీజీపీకి ఫిర్యాదు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.