ఈ నెల 19న చిలకలగూడతోపాటు జంట నగరాల్లో జరిగే బోనాలు వేడుకలు ప్రజలు తమ ఇళ్లలోనే జరుపుకోవాలని, కరోనా వ్యాప్తి నివారణలో సహకరించాలని శాసనసభ ఉప సభాపతి పద్మారావు గౌడ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రతి ఏటా చిలకలగూడ కట్టమైసమ్మ ఆలయంలో జరిగే బోనాల వేడుకలకు లక్షల మంది భక్తులు హాజరవుతారు. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో వేడుకలను నిర్వహించడం లేదు. అందువల్ల తమ ఇళ్లలోనే బోనాలు జరుపుకోవాలని, ఆలయాలకు రావద్దని, సురక్షితంగా ఉండాలని నగరవాసులకు సూచించారు. పోలీసులు, అధికార యంత్రాంగానికి సహకరించాలని కోరారు.
అమ్మవారి దీవెనలు, సికింద్రాబాద్ నియోజకవర్గ ప్రజల ప్రార్ధనలతో నేను, నా కుటుంబ సభ్యులు కరోనా బారి నుంచి బయటపడ్డామన్నారు. ప్రజలు మున్ముందు కరోనా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. కొవిడ్ మహమ్మారిని కట్టడి చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని, వైద్యులు అహర్నిశలు శ్రమిస్తున్నారని తెలిపారు.
ఇదీ చూడండి : అడవిని జల్లెడ పడుతున్న పోలీసులు.. చిక్కని మావోయిస్టులు