దసరా ఉత్సవాలకు విజయవాడ దుర్గగుడి అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఈ ఏడాది కరోనా కారణంగా అన్ని రకాల ప్రసాదాలు అందుబాటులో ఉంచట్లేదని అధికారులు తెలిపారు. అమ్మవారి లడ్డూలు మాత్రమే పంపిణీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.
దసరా ఉత్సవాలు మొదలైన తర్వాత 4 రోజులు.. రోజుకు 50 వేల లడ్డూల చొప్పున తయారుచేసేలా ప్రణాళిక వేశారు. మిగిలిన రోజులు మొత్తం కలిపి 5 లక్షల లడ్డూలు తయారు చేయాలని భావిస్తున్నారు. మొత్తం 7లక్షల లడ్డూలు తయారుచేయనున్నారు. కరోనా కారణంగా రోజుకు 10 వేల మంది భక్తులకు మాత్రమే అనుమతి ఇవ్వనున్నారు.
ఇవీ చదవండి : జూరాలకు కొనసాగుతున్న వరద... 44గేట్లు ఎత్తివేత