కార్మికుల సమన్వయంతో సింగరేణిలో రికార్డుస్థాయి ఉత్పత్తిని సాధించిందని సీఎం కేసీఆర్ అన్నారు. శాసన సభలో సింగరేణి కార్మికులకు బోనస్ ప్రకటించారు. ఐదేళ్లుగా సింగరేణిలో లాభాలు ఏటా పెరుగుతూనే ఉన్నాయని తెలిపారు. ఈ ఏడాది సింగరేణి లాభాల్లో వాటాను గతం కంటే అదనంగా మరోశాతం పెంచుతున్నామని వెల్లడించారు. సింగరేణి కార్మికులకు లాభాల్లో 28శాతం బోనస్ అందజేస్తామన్నారు. ఒక్కో కార్మికునికి రూ. ఒక లక్షా 8వందల 99 బోనస్ అందుతుందని సీఎం తెలిపారు. గత ఏడాది కంటే ఈసారి 40,530 రూపాయలు అదనంగా పొందనున్నారు.
సింగరేణి కార్మికులకు రూ. ఒక లక్షా 8వందల 99 దసరా బోనస్
సింగరేణి కార్మికులకు దసరా బోనస్ ప్రకటించారు సీఎం కేసీఆర్. ఈ ఏడాది ఒక లక్షా 8వందల 99 రూపాయల బోనస్ అందుకోనున్నారు. ప్రభుత్వం అందించే ప్రోత్సాహకం తీసుకుని మరిన్ని లాభాలు వచ్చేలా పనిచేయాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.