ETV Bharat / city

ఆ విమానాశ్రయం వద్ద రెండు రోజులుగా తెలుగు ప్రయాణికుల పడిగాపులు.. - విమాన సర్వీసు రద్దుతో ప్రయాణికులు తిప్పలు

దసరా పండగ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని స్వగ్రామాలకు వెళ్తున్న ప్రయాణికులతో ఇప్పటికే రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు కిక్కిరిసిపోయాయి. అదనపు సర్వీసులు ఏర్పాటు చేసినా కొందరు సీట్లు దొరకక నానా అవస్థలు పడుతున్నారు. ఇదిలా ఉండగా.. పండుగ వేళ స్వగ్రామాలకు రావాలనుకున్న పలువురు తెలుగువారు రెండు రోజులుగా కొల్హాపూర్​ ఎయిర్‌పోర్టులో పడిగాపులు కాస్తున్నారు.

Airport story kolhapur
Airport story kolhapur
author img

By

Published : Oct 2, 2022, 6:56 PM IST

passengers are facing dire situations at airport
విమానాశ్రయంలో నిరీక్షిస్తున్న ప్రయాణికులు

దసరా, దీపావళి, సంక్రాంతి.. ఇలా కొన్ని పండుగలు వచ్చాయంటే తెలుగు వారు ఎక్కడున్నా స్వగ్రామాలకు చేరుకుంటుంటారు. తాజాగా దసరా పండుగ నేపథ్యంలో ఇప్పటికే స్వగ్రామాలకు వెళుతున్న ప్రయాణికులతో రాష్ట్రంలోని రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు కిక్కిరిసిపోయాయి. సీట్లు దొరకక నిలబడి.. నానా ఇబ్బందులు పడుతూ ఇళ్లకు చేరుతున్నారు. ఇదిలా ఉండగా.. విమాన సర్వీసుల్లో స్వగ్రామాలకు వస్తున్న తెలుగు వారు రెండు రోజులుగా ఎయిర్‌పోర్టులో నిరీక్షిస్తూ తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఘటన కొల్హాపూర్ విమానాశ్రయంలో చోటుచేసుకుంది.

Airport story kolhapur
Airport story kolhapur

శనివారం కొందరు తెలుగు వారు కొల్హాపూర్‌ నుంచి హైదరాబాద్‌ శంషాబాద్‌ విమానాశ్రయానికి రావడానికి అలయన్స్ ఎయిర్‌ విమానంలో టికెట్లు బుక్ చేసుకున్నారు. నిన్న ఎయిర్​పోర్టుకు వచ్చిన ప్రయాణికులు.. సమయానికి విమానం రాకపోవడంతో నిన్నటి నుంచి అక్కడే నిరీక్షిస్తున్నారు. శనివారం రాత్రి కొల్హాపూర్ విమానాశ్రయంలోనే బస చేశారు. పలువురు ప్రయాణికులు అధికారులను ప్రశ్నించగా.. రోజులో 3 నుంచి 4 సార్లు విమానం వస్తుందని చెప్పారు. అయినా సాయంత్రం వరకు విమానం రాలేదు. దాంతో కొందరు సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. చివరకు ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు సమయం ఇచ్చారు. అయితే సాయంత్రం 6 గంటల వరకూ విమానం రాకపోవడంతో ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారు. ఇప్పటికీ 5 నుంచి 6 సార్లు విమాన సర్వీసు రద్దు చేయడంతో విమానాశ్రయ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులతో గొడవకు దిగారు. నిరీక్షిస్తున్న వారిలో ఇద్దరు గర్భిణీలు, చంటిపిల్లలు ఉన్నారు. వారికి ఉదయం నుంచి తినడానికి తిండిలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

విమానాశ్రయం వద్ద ప్రయాణికులు

మరోవైపు శంషాబాద్ విమానాశ్రయం నుంచి కొల్హాపూర్ విమాన సర్వీసు రద్దయిన విషయాన్ని ఆ సంస్థ సిబ్బంది ఆలస్యంగా చెప్పడంతో అక్కడ ప్రయాణికులు ఆందోళనకు దిగారు. విమానాశ్రయం అధికారుల వివరాల ప్రకారం.. శనివారం శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి మహరాష్ట్రలోని కొల్హాపూర్‌కు ఉదయం 9.05 నిమిషాలకు 45 ప్రయాణికులతో అలయన్స్ ఎయిర్‌లైన్స్ విమానం బయలుదేరాలి. ప్రయాణికులు సిద్ధమైన తర్వాత ఇదిగో.. అదిగో అంటూ సిబ్బంది సాయంత్రం వరకు మభ్యపెట్టారు. సాయంత్రం 5.30 నిమిషాలకు విమానం రద్దయినట్లు తెలిపారు. ప్రయాణికులు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. ఉన్నతాధికారులు స్పందించి టికెట్ డబ్బులు తిరిగి చెల్లిస్తామని చెప్పడంతో శాంతించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.