ఈఎస్ఐ ఔషధ కొనుగోళ్ల కుంభకోణంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పలువురి ఇళ్లలో సోదాలు చేస్తున్నామని ఏసీబీ డీఎస్పీ ఆనంద్‌కుమార్ అన్నారు. ఈ స్కామ్‌లో ఎంతటి వారున్నా వదిలేది లేదని స్పష్టం చేశారు. అధికారుల ఆదేశాల మేరకు ప్రగతినగర్‌లో నివాసముంటున్న కొడాలి నాగలక్ష్మి ఇంట్లో జరిపిన సోదాల్లో కొన్ని కీలక పత్రాలు లభ్యమైనట్లు తెలిపారు. వాటిని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత వివరాలు వెల్లడిస్తామన్నారు.
- ఇదీ చూడండి : ఈఎస్ఐ స్కాం: 23 మంది ఇళ్లలో అనిశా సోదాలు