ETV Bharat / city

విశాఖలో డ్రగ్స్‌ కలకలం.. 54 గ్రాముల మాదకద్రవ్యాలు స్వాధీనం - పోలీసుల అదుపులో ముగ్గురు

Drugs in Visakha: తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ కలకలం సృష్టిస్తోంది. పబ్​లు, పోలీసుల తనిఖీల్లో భారీగా డ్రగ్స్, గంజాయి పట్టుబడటం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల హైదరాబాద్​లోని ఓ పబ్​లో మత్తు పదార్థాలు బయటపడగా.. తాజాగా ఏపీలోని విశాఖలో మాదకద్రవ్యాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

drugs in AP
విశాఖలో డ్రగ్స్‌ కలకలం
author img

By

Published : Apr 13, 2022, 3:32 PM IST

Drugs in Visakha: ఏపీలోని విశాఖలో డ్రగ్స్‌ కలకలం రేపింది. 54 గ్రాముల మాదకద్రవ్యాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. పూర్తి వివరాలను సాయంత్రం అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది. కాగా కొన్ని రోజుల క్రితం హైదరాబాద్​ బంజారాహిల్స్​లోని ఓ పబ్​ను అర్ధరాత్రి దాటినా నడపటం, పోలీసుల డెకాయ్ ఆపరేషన్​లో భారీగా మత్తు పదార్థాలు దొరకడం సంచలనం సృష్టించింది. ఈ కేసుకు సంబంధించి రాష్ట్ర పోలీసులు ఇంకా దర్యాప్తు చేస్తూనే ఉన్నారు. ఇంతలోనే ఏపీలో మాదకద్రవ్యాలు బయటపడటం ఆందోళన కలిగించే అంశం.

ఇవీ చదవండి: కలెక్టర్​ టెన్నిస్​ ఆట కోసం.. 21 మంది వీఆర్​ఏలు, ఏడుగురు వీఆర్​ఓల డ్యూటీ..!!

చైనా కంపెనీకి షాక్.. గ్లోబల్​ వైస్​ ప్రెసిడెంట్​కు ఈడీ నోటీసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.