ETV Bharat / city

డ్రైవింగ్​ లైసెన్స్​ గడువు ముగిసిందా.. ఏం పర్లేదు.

అసలే లాక్​డౌన్​.. బయటకు వెళ్తే పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఇలాంటి సమయంలోనే డ్రైవింగ్​ లైసెన్స్​ గడువు ముగిసిందని, వాహనాల ఫిట్​నెస్ సర్టిఫికెట్లు, పర్మిట్లు లభించలేదని ఆందోళన చెందుతున్నారా? అయితే మీకోసం ఓ శుభవార్తను అందించింది రవాణా శాఖ

driving licence renewal time extended
డ్రైవింగ్​ లైసెన్స్​ గడువు ముగిసిందా.. ఏం పర్లేదు.
author img

By

Published : Apr 1, 2020, 10:42 AM IST

డ్రైవింగ్ లైసెన్స్​తో పాటు వాహనాల ఫిట్​నెస్ సర్టిఫికెట్లు, పర్మిట్లు, రిజిస్ట్రేషన్ల కోసం ఎదురుచూస్తున్న వారికి ప్రభుత్వ తీపికబురు అందించింది. డ్రైవింగ్ లైసెన్స్ గడువు ముగిసినా జూన్ 30 వరకు చెల్లుబాటు అయ్యేలా వెసులుబాటు కల్పిస్తూ రవాణా శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఫిబ్రవరి 1 నుంచి జూన్ 30 వరకు గడువు ముగిసిన, ముగుస్తోన్న వాహనాలపై ఎన్​ఫోర్స్​మెంట్ యంత్రాంగం ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఉత్తర్వుల్లో పేర్కొంది.

రాష్ట్రంలో చాలా మంది డ్రైవింగ్ లైసెన్స్ కోసం ధరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటికే ఫీజులు చెల్లించిన వారు, వాహనాల ఫిట్​నెస్ ముగిసినవారు, డ్రైవింగ్​ లైసెన్స్ గడువు ముగుస్తోన్న వారు ఉన్నారు. వీరంతా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రవాణాశాఖ అధికారులు వెల్లడించారు.

ఇవీ చూడండి: కరోనా నియంత్రణకై సరికొత్త ఎయిర్ ప్యూరిఫైయర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.