హైదరాబాద్ హఫీజ్‌పేట్‌లో బాలింగ్ సత్తయ్య మెమోరియల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో... కరోనా పట్ల వినూత్న రీతిలో అవగాహన కల్పించారు. కరోనా మహమ్మారిని నివారించేందుకు పోలీసులకు సహకరించాలని మియాపూర్ క్రాస్‌రోడ్డులో చిత్రాలు గీయించారు. వైరస్ నియంత్రణకు ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు చేపడుతున్నట్టు ఛైర్మన్ గౌతమ్ గౌడ్ తెలిపారు. మనం బతుకుతూ తోటివారిని బతకనివ్వాలని కోరారు. కార్యక్రమంలో మియాపూర్ సీఐ వెంకటేశ్, ట్రాఫిక్ సీఐ నర్సింగరావు, ఎస్సై రఘురాం, ఆర్టిస్టు అసోసియేషన్ ప్రతినిధి అబ్దుల్ బాసిత్ పాల్గొన్నారు.
ఇదీ చూడండి: ఆ విషయం గురించి కేటీఆర్‌తో మాట్లాడా: కిషన్‌రెడ్డి