న్యూయర్క్తో పాటు అమెరికాలో ఎలాంటి వాతారవరణం ఉంది?
అమెరికాలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. 6 లక్షలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. న్యూయార్క్‌లోనే ఎక్కువ కేసులున్నాయి.
న్యూయార్క్‌లో ఇలాంటి పరిస్థితికి కారణం ఏంటి?
న్యూయార్క్‌లో జనసాంధ్రత ఎక్కువ. ప్రతిరోజూ 40 నుంచి 50 లక్షల మంది ప్రయాణిస్తారు. అందుకే వైరస్ వ్యాప్తి పెరిగింది.
కరోనా కట్టడికి అమెరికా పౌరులు ప్రభుత్వ సూచనలు పాటించలేదా. భౌతిక దూరం పాటించలేదా?
ప్రభుత్వం అప్రమత్తమయ్యేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. వైరస్ వ్యాప్తి పెరిగిపోయింది. ఇండియాలోలాగా నిబంధనలు కచ్చితంగా అమలు కాలేదు.
అమెరికాలో కరోనా కేసులు ఎలా ఉంటున్నాయి?
80 శాతం మందికి లక్షణాలు తక్కువగానే ఉంటాయి. వాళ్లు తొందరగానే కోలుకుంటున్నారు. 20శాతం మందిలో మాత్రం తీవ్రత ఎక్కువగా ఉంటోంది.
ఏలాంటి అలవాట్లు ఉన్నవారికి కరోనా ప్రభావం తీవ్రంగా ఉంటుంది?
ఊపిరితిత్తుల సమస్యలున్నవారికి, పొగతాగే వారికి, ఈ సిగరేట్ తాగేవారికి, క్యాన్సర్, ఊబకాయం ఉన్నవారిపై ప్రభావం ఎక్కువగా ఉంటుంది. డయాలసిస్ చేసుకునేవారు జాగ్రత్తగా ఉండాలి.
కరోనా నుంచి కోలుకున్నవారికి మళ్లి వచ్చే అవకాశం ఉందా?
కరోనా నుంచి కోలుకున్నవారికి రోగనిరోధక శక్తి పెరుగుతుంది. రోగ నిరోధక శక్తి ఎక్కువ ఉన్నవారికి కరోనా మళ్లి వచ్చే అవకాశం లేదు. చైనాలో అంలాంటి కేసులు కొన్ని వచ్చాయని చెబుతున్నారు.
కరోనా నుంచి రక్షించుకునేందుకు భారతీయులకు ఎలాంటి సూచనలు ఇస్తారు?
వ్యాయామం, యోగా చేయాలి. ప్రాణాయామం చాలా బాగా ఉపయోగపడుతుంది. ఓం అనే మంత్రం అన్ని నాడుల్ని కదిలిస్తుంది. కపాలభాతి ఆసనం ఎంతగానో మేలు చేస్తుంది. కూరగాయలు, పండ్లు తినాలి. అల్లం టీ, పాలల్లో పసుపు వెసుకొని తాగాలి. జంక్ పుడ్లు తినొద్దు.
ఇదీ చూడండి: 'పరీక్షల సంఖ్య పెరిగితేనే కరోనా కట్టడి సాధ్యం'