ETV Bharat / city

డిగ్రీ ఆన్​లైన్​ ప్రవేశాల నోటిఫికేషన్​ విడుదల!

డిగ్రీ ఆన్​లైన్​ ప్రవేశాల కోసం రాష్ట్ర ఉన్నత విద్యామండలి దోస్త్​ నోటిఫికేషన్​ను విడుదల చేసింది. ఆగష్టు 24 నుంచి సెప్టెంబర్​ 7 వరకు మొదటి విడత రిజిస్ట్రేషన్లు నిర్వహించనున్నట్టు దోస్త్​ కన్వీనర్​ ప్రొఫెసర్​ లింబాద్రి తెలిపారు. సెప్టెంబర్​ 16న మొదటి విడత డిగ్రీ సీట్ల కేటాయింపు ఉంటుందని ఆయన తెలిపారు.

Dost Notification Released For Degree Admissions
డిగ్రీ ఆన్​లైన్​ ప్రవేశాల నోటిఫికేషన్​ విడుదల!
author img

By

Published : Aug 20, 2020, 6:45 PM IST

రాష్ట్ర ఉన్నత విద్యామండలి డిగ్రీ ఆన్​లైన్ ప్రవేశాల కోసం దోస్త్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆగష్టు 24 నుంచి సెప్టెంబరు 7వరకు మొదటి విడత రిజిస్ట్రేషన్లు ఉంటాయని దోస్త్ కన్వీనర్ ప్రొఫెసర్ లింబాద్రి తెలిపారు. ఆగష్టు 28 నుంచి సెప్టెంబరు 8వరకు మొదటి విడత్ వెబ్ ఆప్షన్ల నమోదు చేసుకోవచ్చు. దివ్యాంగులు, ఎన్​సీసీ, క్రీడల కేటగిరి అభ్యర్థులకు సెప్టెంబరు 3, 4 తేదీల్లో యూనివర్సిటీల్లోని హెల్ప్​లైన్ కేంద్రాల్లో ధృవపత్రాల పరిశీలన ఉంటుది. సెప్టెంబరు 16న మొదటి విడత డిగ్రీ సీట్లను కేటాయించనున్నట్టు.. మొదటి విడతలో సీటు పొందిన విద్యార్థులు సెప్టెంబరు 17 నుంచి 22వరకు ఆన్​లైన్​లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవాలని కన్వీనర్​ తెలిపారు.

సెప్టెంబరు 17 నుంచి 23 వరకు రెండో విడత దోస్త్ రిజిస్ట్రేషన్లు, వెబ్ ఆప్షన్లు మొదలవుతాయి. సెప్టెంబరు 28 నుంచి రెండో విడత సీట్లు కేటాయిస్తారు. మూడో విడత రిజిస్ట్రేషన్లు, వెబ్ ఆప్షన్లు సెప్టెంబరు 28 నుంచి అక్టోబరు 3 వరకు కొనసాగుతాయి. అక్టోబరు 8న మూడో విడత డిగ్రీ సీట్లను వెల్లడిస్తామని దోస్త్​ కన్వీనర్​ లింబాద్రి తెలిపారు. సెప్టెంబరు 10లోపు ఆన్ లైన్ లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని, డిగ్రీ తరగతులు ప్రారంభమయ్యే తేదీని తర్వాత ప్రకటిస్తామని ఆయన పేర్కొన్నారు. ఆధార్​తో అనుసంధానం చేసిన మొబైల్​, మీ సేవా కేంద్రాల ద్వారా, రాష్ట్రంలోని 105 హెల్ప్​లైన్​ కేంద్రాల ద్వారా దోస్త్​ రిజిస్ట్రేషన్లు, వెబ్​ ఆప్షన్లు చేసుకోవచ్చని తెలిపారు.

ఇవీ చూడండి: 'కరోనా టీకా అత్యవసర ఆమోదాన్ని పరిశీలిస్తాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.