ETV Bharat / city

Corona: చికిత్సనందిస్తూనే మృత్యుఒడికి! - ఏపీలో వైద్యులకు కరోనా

వారు నాడి పడితే భరోసా.. ప్రేమగా పలకరిస్తే సగం వ్యాధి మటుమాయం. అందుకే వారు వైద్య నారాయణులు. జీవచ్ఛవాల్లో చైతన్యం రగిల్చినా, ప్రమాదాల్లో ఛిద్రమైన శరీరం ప్రాణం నిలిపినా.. దాని వెనుక వైద్యుల అకుంఠిత దీక్ష దాగి ఉంటుంది. మేమున్నామంటూ విశ్వాసం పెంచిన ఈ వైద్యులు కరోనాపై పోరులో మాత్రం ఓడిపోయారు. స్వీయ జాగ్రత్తలు తీసుకుంటున్నా కరోనా వారిని మింగేసింది. బాధితులకు  చికిత్సనందించే క్రమంలో జీవితాలనే పణంగా పెట్టారు.

corona to doctors
కరోనాతో వైద్యులు మృతి
author img

By

Published : Jun 9, 2021, 8:11 AM IST

రోగికి ఎల్లవేళలా భరోసానిచ్చే వైద్యులను సైతం కరోనా మహమ్మారి వదలడం లేదు. వైద్య నిపుణులతోపాటు పీహెచ్‌సీ వైద్యులు కొందరు సేవలందిస్తూనే కన్నుమూశారు. ఆంధ్రప్రదేశ్​లోని గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం, ప్రకాశం, చిత్తూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో వైద్యుల మరణాలు నమోదయ్యాయి. ప్రాథమికంగా అందిన సమాచారం ప్రకారం.. ప్రభుత్వ వైద్యులు 8 మంది, కొందరు ప్రైవేటు వైద్యులు కరోనా రెండో దశలో కన్నుమూశారు. వీరిలో కొందరు ఒక టీకా, మరికొందరు రెండు టీకాలు తీసుకున్నవారు కూడా ఉన్నారు. కొవిడ్‌ తొలి దశలో 10 మంది ప్రభుత్వ, 25 మంది ప్రైవేటు వైద్యులు చనిపోయారు.

ప్లాస్మా థెరపీ చేయించినా కోలుకోలేదు..

కరోనా బారిన పడి మృతి చెందిన డా. వేణుగోపాల్​

విశాఖ కేజీహెచ్‌ పీడియాట్రిక్‌ విభాగాధిపతి, రెడ్‌క్రాస్‌ విశాఖ జిల్లా కమిటీ గౌరవ ఛైర్మన్‌ పి.వేణుగోపాల్‌ కొవిడ్‌తో కన్నుమూశారు. తొలి, మలి దశల్లో కరోనా బారినపడ్డ పిల్లలకు ఏప్రిల్‌ 20 వరకు ఆయన కేజీహెచ్‌లో వైద్యమందించారు. పిల్లల వైద్యుడిగా ఆయన ఎంతో పేరు సంపాదించారు. కొవిడ్‌ కేసులు పెరిగే సమయంలో అదే నెల 21న ఆయనతోపాటు ఆయన భార్య శుభ అస్వస్థులయ్యారు. 24న చేయించుకున్న పరీక్షల్లో దంపతులకు పాజిటివ్‌ రావడంతో ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. వారంలో భార్య కోలుకున్నారు. వేణుగోపాల్‌ ఆరోగ్యం విషమించడంతో ప్లాస్మా థెరపీ, స్టెమ్‌సెల్‌ థెరపీని ప్రయత్నించారు. అమెరికాకు చెందిన వైద్య నిపుణులు సూచనలందించారు. మే 9 నుంచి వెంటిలేటర్‌పై ఉంచారు. కోలుకోలేక 14న కన్నుమూశారు. ఆయన రెండు డోసుల టీకా తీసుకున్నా కొవిడ్‌ బారిన పడక తప్పలేదు. మధుమేహం, రక్తపోటువంటి రుగ్మతలు జతగూడి కరోనా మింగేసేలా చేసింది. పిల్లల వైద్యుడిగా దాదాపు 28 ఏళ్లపాటు కేజీహెచ్‌లో సేవలందించిన ఆయన.. 70 మంది పీజీలకు శిక్షణనిచ్చారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పరిశోధన పత్రాలను సమర్పించారు.

జూనియర్‌ వైద్యురాలిగా సేవలందిస్తూ..

మహమ్మారి కాటుకు బలైన డా. కె. రోజీ

తూర్పుగోదావరి జిల్లా సకినేటిపల్లి మండలం మోరి గ్రామానికి చెందిన కె.రోజి ఏలూరులోని ఆశ్రం వైద్య కళాశాలలో ఎంబీబీఎస్‌ చదివి అక్కడే ఇంటర్న్‌షిప్‌ చేస్తున్నారు. ఆశ్రంలోని కొవిడ్‌ బాధితులకు సేవలందించే సమయంలో కొవిడ్‌ బారినపడ్డారు. ఆశ్రంలో చికిత్స పొందాక సొంతింటికి వెళ్లారు. మళ్లీ ఆమె ఆరోగ్యం విషమించడంతో ఆసుపత్రిలో చేరినప్పటికీ నిష్ఫలమైంది. ఆక్సిజన్‌ స్థాయి ఒక్కసారిగా తగ్గి ప్రాణాలు కోల్పోయారు.

పోలీసులను రక్షిస్తూ.. అర్పణం

కరోనాతో మృతి చెందిన పసుపులేటి సుజాత

కరోనాపై పోరులో ముందు వరుసలో ఉన్న పోలీసులు ఎందరో వ్యాధి బారిన పడ్డారు. వారికి పసుపులేటి సుజాత (49) ఉత్తమ వైద్యాన్ని అందించారు. వైరస్‌ సోకిన పోలీసులను పరామర్శిస్తూ, ధైర్యం చెబుతూ కోలుకునేలా చేశారు. నెల్లూరులోని పోలీసు వెల్ఫేర్‌ క్లినిక్‌ వైద్యాధికారిగా నాలుగేళ్ల నుంచి పని చేస్తున్నారు. అంతకుముందు చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లోని పలు పీహెచ్‌సీల్లో సేవలందించారు. ఎమర్జెన్సీ మెడిసన్‌లో నిపుణుడైన భర్త కిశోర్‌ కుమార్‌ నెల్లూరు సెంట్రల్‌ జైలు ఆసుపత్రి వైద్యుడు. 15 ఏళ్ల కిందట పెళ్లయిన వారికి పాప నిఖిత ఉంది. స్వీయరక్షణ చర్యలు తీసుకుంటూనే పోలీసుల్లో వైరస్‌ బాధితులకు సుజాత చికిత్సనందించారు. ఈ క్రమంలోనే కరోనా సోకింది. స్వల్ప లక్షణాలు కనిపించడంతో తొలుత తానే సొంతంగా వైద్యం చేసుకున్నారు. భర్త కూడా బాధితుడయ్యారు. సుజాత సీటీ స్కాన్‌లో 18 శాతం ఊపిరితిత్తులకు వైరస్‌ సోకిందని తేలింది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఫలితం లేక నారాయణ ఆసుపత్రిలో చేరారు. శ్వాస ఇబ్బందుల వల్ల వెంటిలేటర్‌పై చేర్చారు. పరిస్థితి విషమించి మే 9న ఆమె ప్రాణాలు విడిచారు.

పోరాట యోధులెందరో..

తిరుపతిలోని కృషి న్యూరో ఆసుపత్రి యజమాని రాజారావు, గతంలో రుయాలో, ఇప్పుడు చిత్తూరు అపోలోలో పని చేస్తున్న సంజీవయ్య (63), స్కానింగ్‌ సెంటర్‌ నిర్వాహకుడు రమేశ్‌బాబు (47), మదనపల్లెకు చెందిన లక్ష్మణ్‌కాంత్‌ (75), విజయవాడకు చెందిన ఎముకల వైద్య నిపుణుడు బీరం సాంబశివరావు, మత్తు వైద్యుడు జి.వి.చలపతిరావు (71) కూడా కొవిడ్‌ బారిన పడి ప్రాణాలు విడిచారు.

ఓపిగ్గా పలకరిస్తూ వైద్యం

ఆచార్య ఆదిశేషుబాబు

గుంటూరు ప్రభుత్వ బోధనాసుపత్రి జనరల్‌ మెడిసిన్‌ విభాగాధిపతి ఆచార్య ఆదిశేషుబాబు (54). ఆయన రెండు దశాబ్దాలకుపైగా రోగుల సేవలో ఉన్నారు. ఇక్కడ వారానికో రోజు ఉండే ఓపీ విభాగాన్ని స్వయంగా పర్యవేక్షించేవారు. వార్డుల్లో కలియదిరుగుతూ రోగుల సమస్యలను ఓపిగ్గా వినేవారు. సిబ్బందిని అప్రమత్తం చేసేవారు. పీజీ వైద్యులకు శిక్షకుడిగా, ఎగ్జామినర్‌గా ప్రేమతో బాధ్యతలను నిర్వహించేవారు. వైద్య కళాశాలల అనుమతుల ప్రక్రియలో భాగంగా ఎంసీఐ తరఫున దేశమంతా విస్తృతంగా పర్యటించారు.
* గుంటూరు జీజీహెచ్‌లో పనిచేస్తున్న అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ రాంబాబు కరోనాతో కన్నుమూశారు

నేత్రవైద్యుడు బలి

నాగూర్​ షరీఫ్​

గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ప్రభుత్వ నేత్ర వైద్యుడు నాగూర్‌ షరీఫ్‌ (52) కొవిడ్‌ బారినపడి చనిపోయారు. విధి నిర్వహణలో ఆయన వ్యాధి బారినపడ్డారు. కంటి వైద్యం కోసం ఆసుపత్రిలో పలు పరికరాలను సమకూర్చేందుకు ఆయన విశేష కృషి చేశారు. శ్రీకాకుళం జిల్లా మందసకు చెందిన ఆయుష్‌ వైద్యుడు బి.వి.రమణమూర్తి (55) పాతపట్నం మండలం బైదళపురం పీహెచ్‌సీలో విధులు నిర్వహిస్తూ చనిపోయారు.

డిప్యుటేషన్‌పై సేవలు

తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురానికి చెందిన ముప్పన సతీష్‌ కుమార్‌ (48) దంత వైద్యుడిగా 2008లో ప్రస్థానం ప్రారంభించారు. జగ్గంపేట పీహెచ్‌సీలో సేవలందించేవారు. కొవిడ్‌ సేవల కోసం ఆయన్ని రాజమహేంద్రవరం జిల్లా ఆసుపత్రికి డిప్యుటేషన్‌పై పంపారు. బాధితులకు సేవలందించే క్రమంలో కరోనా బారినపడ్డారు. గత నెల 21న ప్రాణాలు కోల్పోయారు.

3 ఆసుపత్రులు తిరిగినా..

జన్నెల రవికుమార్​

3 ఆసుపత్రులు తిరిగినా ప్రాణాలు దక్కించుకోలేకపోయారు విజయనగరం జిల్లా కుష్ఠు నివారణ పర్యవేక్షణ అధికారి, చర్మవ్యాధి నిపుణుడు జన్నెల రవికుమార్‌. ఎస్‌.కోట నియోజకవర్గ పరిధిలోని ఆసుపత్రులకు నోడల్‌ అధికారిగా ఉన్నప్పుడు కరోనా బారినపడి చికిత్స పొందుతూ మే 12న ప్రాణాలు కోల్పోయారు. ఫిబ్రవరిలో రెండో డోసు వ్యాక్సినేషన్‌ పూర్తయింది. ఏప్రిల్‌ 23న విధుల్లో ఉండగానే కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్ష చేయించుకోగా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వైద్యుల సలహా మేరకు మందులు వాడుతూ హోం ఐసొలేషన్‌లో ఉన్నారు. అనారోగ్య తీవ్రత పెరిగినందున అదే నెల 29న శ్రీకాకుళం రిమ్స్‌లో చేరారు. ఆరు రోజులపాటు అక్కడే చికిత్స పొందారు. పరిస్థితి మెరుగు కానందున అక్కడి నుంచి విజయనగరంలోని మహారాజా ఆసుపత్రికి మే 4న తీసుకెళ్లారు. అక్కడ వెంటిలేటర్‌పై ఉంచి చికిత్సనందించారు. రెండ్రోజుల తరువాత మెరుగైన వైద్యం అవసరం కావడంతో విశాఖలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. అయినా మే 12న శ్వాస సమస్యతో ప్రాణాలు విడిచారు.

ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ సభ్యత్వమున్న వైద్యుల్లో ఈ ఏడాది ఇప్పటివరకు సుమారు 30 మంది మరణించారని సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందకిశోర్‌ చెప్పారు. వీరిలో కొందరు కొవిడ్‌తో చనిపోయారని వెల్లడించారు. కొవిడ్‌కు సంబంధించి ఓపీ, ఐసీయూ, పరిపాలన విభాగాల్లో ఉన్న వైద్యుల్లో 8మంది కన్నుమూశారు. కొవిడ్‌ వచ్చిన వైద్యులకు ప్రత్యేకంగా సెలవులనివ్వాలని ప్రభుత్వ వైద్యుల సంఘం నాయకుడు జయధీర్‌ కోరారు. తొలి దశలో కరోనా బారినపడ్డ ప్రభుత్వ వైద్యుల్లో ఇద్దరు ముగ్గురికి మినహా మిగిలినవారికి రూ.50 లక్షల చొప్పున పరిహారం అందినట్లు జయధీర్‌ తెలిపారు.

ఇదీ చదవండి: CORONA: కుటుంబాల్ని కాటేసిన కరోనా.. అనాథలైన చిన్నారులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.