మోకాళ్ల నొప్పులతో బాధపడే వారికోసం లాక్డౌన్ సమయంలోనూ ఆన్లైన్ ద్వారా అందుబాటులో ఉంటానని ప్రముఖ వైద్యుడు గురవారెడ్డి ప్రకటించారు. ఈ మేరకు ఓ వీడియో విడుదల చేశారు. మోకాళ్ల నొప్పులతో బాధపడే వారు.. తనను ఎంఫైన్ యాప్ ద్వారా సంప్రదించాలని కోరారు. ఈ యాప్ ద్వారానే ఎక్స్రే, పాత మెడికల్ రిపోర్టులను పంపవచ్చని తెలిపారు. వాటిని పరిశీలించిన అనంతరం.. తానే వీడియో కాల్ చేసి సలహాలిస్తానని గురవారెడ్డి తెలిపారు.
ఇవీచూడండి: ఎంతమందికైనా కరోనా పరీక్షలు చేసేందుకు సిద్ధం: కేసీఆర్