ETV Bharat / city

corona: వైద్యులపై కరోనా కాటు.. ఒకేరోజు డాక్టర్, నర్స్ మృతి!

కరోనా మహమ్మారి వైద్యులపైనా కనికరం చూపడం లేదు. ప్రాణాలు నిలబెట్టే వారి ప్రాణాలనే హరిస్తోంది. తాజాగా తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలంలోని మోరి గ్రామానికి చెందిన కందికట్ల రోజి అనే వైద్యురాలు కరోనా కారణంగా మృతి చెందారు. కడప బద్వేలు కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్​లో పనిచేస్తున్న స్టాఫ్‌నర్సు పద్మావతిని సైతం కరోనా మహమ్మారి బలితీసుకుంది.

doctor, nurse died in a single day due to corona, covid deaths
కరోనాతో డాక్టర్ మృతి, కరోనాతో నర్స్ మృతి
author img

By

Published : Jun 2, 2021, 12:10 PM IST

రెండో దశలో కరోనా మహమ్మారి వందల మంది ప్రాణదాతలను బలితీసుకుంటోంది. వైరస్ ధాటికి వైద్యులూ ప్రాణాలు కొల్పోతున్నారు. ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలంలోని మోరి గ్రామానికి చెందిన కందికట్ల రోజి అనే వైద్యురాలు కరోనా కారణంగా మరణించారు. ఏలూరులోని ఆశ్రమ్‌ ఆస్పత్రిలో హౌస్‌ సర్జన్‌గా ఆమె సేవలందించారు. అక్కడే ఆమెకు కరోనా సోకగా.. మోరిలోని ఇంటికి వచ్చారు. పరిస్థితి విషమించడంతో సోమవారం స్థానికంగా ఉన్న సుబ్బమ్మ ఆస్పత్రిలో చేర్చగా.. మంగళవారం ఉదయం చనిపోయారు.

ఆస్పత్రిలో చేర్చినప్పటి నుంచి రోజి వైద్యానికి సహకరించలేదని, ఒక్కసారిగా ఆక్సిజన్‌ స్థాయి తగ్గి మరణించారని వైద్యుడు క్రాంతికిరణ్‌ వెల్లడించారు. రోజికి తమ్ముడు, తల్లి ఉన్నారు. ఆమె తల్లి గల్ఫ్‌లో పని చేస్తున్నారు. తండ్రి 15 ఏళ్ల కిందట చనిపోయారని బంధువులు వెల్లడించారు. కష్టపడి చదువుకుని వైద్యురాలు అవుతుందని కలలుకన్న తమకు.. ఇలా దూరమై కన్నీరు మిగిల్చిందని వారంతా కన్నీరు మున్నీరవుతున్నారు.

కడప జిల్లాలో స్టాఫ్​ నర్స్ మృతి..

కడప బద్వేలు కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్​లో పనిచేస్తున్న స్టాఫ్‌నర్సు పద్మావతి (27) మంగళవారం రాత్రి మృతి చెందారు. ఆస్పత్రిలో కొవిడ్‌ విధులు నిర్వహిస్తూ ఇటీవల ఆమె కరోనా మహమ్మారి బారినపడ్డారు. వైద్య చికిత్స నిమిత్తం ఆమెను ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. కరోనాతో పోరాడుతూనే మంగళవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. పద్మావతి మృతి పట్ల స్థానిక వైద్యాధికారి రాంప్రసాద్‌, సిబ్బంది ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు. కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటించారు.

ఇదీ చదవండి: Corona: నెల రోజుల్లో భారీగా తగ్గిన పాజిటివ్‌ కేసులు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.