తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులకు జూన్ 15 నుంచి రైతు బంధు సాయం పంపిణీ చేయనున్నారు. జూన్ 25 లోగా రైతుల ఖాతాల్లో నగదు జమ పూర్తి కానుంది. ఈ మేరకు సీఎం కేసీఆర్ వ్యవసాయశాఖపై చేసిన సమీక్షలో నిర్ణయం తీసుకున్నారు. పార్ట్-బి నుంచి పార్ట్- ఏలోకి చేరిన రైతులకు రైతు బంధు వర్తించనుంది. జూన్ 10 కటాఫ్ తేదీగా ఈ పథకం వర్తింపు ఉండనుంది. విత్తనాలు, ఎరువుల్లో కల్తీని అరికట్టాలని సమీక్ష సందర్భంగా సీఎం నిర్ణయించారు. కల్తీ నివారణకు అవసరమైన చట్ట సవరణ చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. అవసరమైతే ఆర్డినెన్స్ జారీ చేయాలన్నారు.
విత్తనాలకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసే క్యూఆర్ కోడ్ సీడ్ ట్రేసింగ్ విధానం ఉండాలని కేసీఆర్ అన్నారు. మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో మరికొన్ని సాగు నీటి ప్రాజెక్టులు,లిఫ్టులు పూర్తి చేస్తామన్నారు. రాష్ట్రంలోని 75 శాతం చెరువులు వేసలిలోనూ జలకళను సంతరించుకున్నాయన్నారు.
ఇదీ చదవండి: TS Lockdown: రేపు కేబినెట్ భేటీ.. లాక్డౌన్పై కీలక నిర్ణయం