ETV Bharat / city

parliament on Kaleshwaram Project : 'తెలంగాణ సొంత వనరులతోనే కాళేశ్వరం నిర్మాణం'

author img

By

Published : Dec 17, 2021, 7:14 AM IST

parliament on Kaleshwaram Project : కాళేశ్వరం ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం సొంత నిధులతో నిర్మిస్తోందని కేంద్ర జల్​శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ వెల్లడించారు. ఇప్పటి వరకు 80వేల కోట్లు ఖర్చు చేసి 83 శాతం ప్రాజెక్టు పనులను పూర్తి చేసిందని తెలిపారు.

parliament on Kaleshwaram Project
parliament on Kaleshwaram Project

parliament on Kaleshwaram Project : కాళేశ్వరం ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం సొంత వనరులతో నిర్మిస్తోందని కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ వెల్లడించారు. ఇప్పటివరకు రూ.80,321.57 కోట్లు ఖర్చుచేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందని తెలిపారు. జల్‌శక్తి మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని సాగునీరు, వరద నియంత్రణ, బహుళార్థసాధక ప్రాజెక్టుల సలహా సమితి 2018 జూన్‌లో ప్రాజెక్టును అంగీకరించినట్టు చెప్పారు.

Congress on Kaleshwaram Project : ‘‘కాళేశ్వరానికి కేంద్రం అనుమతులు మంజూరుచేసిందా? ఇది కొత్త ఆయకట్టును ఏమైనా సృష్టించిందా? ప్రాజెక్టుకు ఏయే సంస్థలు ఎంతమేరకు రుణాలు మంజూరుచేశాయి? ఈ ప్రాజెక్టుకయ్యే వ్యయం వల్ల కలిగే ప్రయోజన నిష్పత్తి (కాస్ట్‌ బెనిఫిట్‌) ఎంత? అనే విషయమై కేంద్రం అధ్యయనం చేసిందా?’’ అంటూ కాంగ్రెస్‌ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గురువారం లోక్‌సభలో అడిగిన ప్రశ్నలకు కేంద్రమంత్రి సమాధానమిచ్చారు.

కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్

Jal Shakti Ministry on Kaleshwaram : ‘‘రాష్ట్ర ప్రభుత్వం అందించిన సమాచారం మేరకు.. దీనికింద 18,25,700 ఎకరాల ఆయకట్టుకు నీరు అందించాలని, అదనంగా 18,82,970 ఎకరాల భూమిని స్థిరీకరించాలని ప్రతిపాదించారు. మొత్తం 240 టీఎంసీల నీటిని ఎత్తిపోసి, సరఫరా చేయాలనేది లక్ష్యం. జల్‌శక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సలహా సమితి 2015-16 ధరల స్థాయిని అనుసరించి ప్రాజెక్టు వ్యయాన్ని రూ.80,190.46 కోట్లుగా ఖరారుచేసింది. దీనివల్ల వ్యయ/లబ్ధి నిష్పత్తి 1:1.51 మేర(రూపాయికి..రూపాయిన్నర) ఉంటుందని లెక్కించింది. ఇప్పటివరకు ప్రాజెక్టు నిర్మాణానికి రూ.80,321.57 కోట్లు ఖర్చుచేశారు. ఈ ఏడు అక్టోబరు 31 నాటికి నిర్మాణం 83.7% పూర్తయింది. మొత్తం ఆరు సంస్థలు దీనికి రూ.86,064.01 రుణం మంజూరుచేసి, ఇప్పటివరకు రూ.59,539.51 కోట్లు విడుదల చేశాయి’’.

- గజేంద్రసింగ్ షెకావత్, కేంద్ర జల్​శక్తి మంత్రి

20,878 మంది నిర్వాసితులు

Kaleshwaram Project Latest News : కాళేశ్వరం ప్రాజెక్టు కారణంగా సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో 20,878 మంది నిర్వాసితులైనట్లు రాష్ట్ర ప్రభుత్వం సమాచారం అందించిందని లోక్‌సభలో కాంగ్రెస్‌ ఎంపీ ఎ.రేవంత్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర జల్‌శక్తి శాఖ సహాయమంత్రి బిశ్వేశ్వర్‌ టుడూ తెలిపారు.

Lok Sabha on Kaleshwaram Project : దేశవ్యాప్తంగా 21 ప్రాజెక్టులకు అనుమతిచ్చే అంశాన్ని కేంద్ర జలసంఘం పరిశీలిస్తోందని, అందులో తెలంగాణలోని మోదికుంట వాగు మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టు కూడా ఉందని ఆయన మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఈ ప్రాజెక్టు సాంకేతిక-ఆర్థిక లాభదాయకతను సీడబ్ల్యూసీ మదింపు చేస్తోందన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.