ETV Bharat / city

Traffic Pending Challans: ట్రాఫిక్ పెండింగ్​​ చలానాల చెల్లింపునకు గడువు పెంపు - telangana traffic rules

Traffic Pending Challans: రాయితీపై పెండింగ్​ ట్రాఫిక్​ చలానాల చెల్లించేందుకు మరో 15 రోజులు గడువు పొడిగిస్తున్నట్లు రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్​ అలీ వెల్లడించారు. ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులు, స్పందన కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. పెండింగ్​ చలానాల చెల్లింపుతో మార్చి 1 నుంచి సుమారు 250 కోట్లు రూపాయల ఆదాయం వచ్చినట్లు చెప్పారు.

Pending Traffic Challans
Pending Traffic Challans
author img

By

Published : Mar 31, 2022, 5:29 AM IST

Traffic Pending Challans: రాష్ట్రంలో రాయితీతో పెండింగ్ ట్రాఫిక్ చలానాల చెల్లింపు గడువును మరో 15 రోజులు పొడిగిస్తున్నట్లు హోంశాఖ మంత్రి మహమూద్ అలీ ప్రకటించారు. మార్చి 1 తేదీ నుంచి నెలరోజుల పాటు అవకాశం ఇచ్చామని.. ప్రజల నుంచి మంచి స్పందన వస్తుండడం వల్ల మరో 15 రోజుల పాటు ఈ అవకాశాన్ని పొగిడిస్తున్నట్లు చెప్పారు. అంటే ఏప్రిల్​ 15 వరకు పెండింగ్​ చలానాలను రాయితీతో చెల్లించవచ్చన్నారు.

ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా రెండు కోట్ల 40 లక్షల చలాన్లు చెల్లింపులు జరిగాయని హోంశాఖ మంత్రి తెలిపారు. 250 కోట్ల రూపాయల ఆదాయం వచ్చినట్లు చెప్పారు. ఇంతవరకూ చలాన్లు చెల్లించలేకపోయినవారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని మహమూద్​ అలీ కోరారు.

ఇవీచూడండి: అల్లు అర్జున్‌, కల్యాణ్‌రామ్ కార్లకు జరిమానా.. ఎందుకంటే..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.