ఆంధ్రప్రదేశ్‌లో ఆక్సిజన్ కొరతను తగ్గించేందుకు డైరెక్టర్ సుకుమార్ ముందడుగు వేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజోలు మండలంలో ప్రాణవాయువు ప్లాంట్ ఏర్పాటుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ విషయమై తన మిత్రుడు అన్యం రాంబాబుతో కలిసి సబ్‌కలెక్టర్ హిమాన్ష్ కౌశిక్, అనంతపురం అసిస్టెంట్ కలెక్టర్ గోకరకొండ ప్రవీణ్ (స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా) తో బుధవారం చర్చించారు.
ప్లాంట్ నిర్మించేందుకు చేయాల్సిన కార్యాచరణపై మాట్లాడారు. అనుమతులు లభిస్తే వెంటనే నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నామని సుకుమార్ తెలిపారు. రూ.25లక్షలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు అధికారులకు హామీ ఇచ్చారు. ముందస్తుగా ఆక్సిజన్ అందక ఇబ్బంది పడుతున్న వారికి సిలిండర్లు అందించేందుకు ఆజాద్ ఫౌండేషన్‌కు రూ.7లక్షల విలువైన ఆక్సిజన్ సిలిండర్లు అందించారు. కరోనాపై పోరుకు తన వంతు సాయంగా గతేడాది ఏప్రిల్‌లో సుకుమార్ రూ.10 లక్షలు అందజేశారు.
ఇదీ చదవండి: వామనరావు హత్య కేసు నిందితుల బెయిల్ పిటిషన్ కొట్టివేత