ETV Bharat / city

జూబ్లీహిల్స్​ రేప్​ కేసుపై ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు - BJP MLA Raghunandan Rao

RGV on Jubilee Hills Gang Rape Case: జూబ్లీహిల్స్‌ గ్యాంగ్‌ రేప్‌ ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఇందులో రాజకీయ నేతల ప్రమేయం ఉందన్న ఆరోపణలతో ఈ కేసు కీలకంగా మారింది. ప్రతిపక్షాలు ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించడంతో రాజకీయ రంగు పులుముకుంది. మరో వైపు సంచలన విషయాలపై తనదైన శైలిలో స్పందించే దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ... జూబ్లీహిల్స్‌ ఘటనపై కూడా స్పందించారు.

Director ram gopal varma reacted on Jubileehills Gang rape case

author img

By

Published : Jun 8, 2022, 7:38 PM IST

RGV on Jubilee Hills Gang Rape Case:రాష్ట్రంలో సంచలనంగా మారిన జూబ్లీహిల్స్​ బాలిక అత్యాచారం కేసుపై వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ట్విటర్ వేదికగా స్పందించారు. ఘటనకు సంబంధించినంత వరకు ఒక సామాన్యునిగా ఆలోచిస్తే.. ఎమ్మెల్యే రఘునందన్ రావు మాత్రమే నిజాయితీగా మాట్లాడుతున్నట్టు అనిపిస్తోందని పేర్కొన్నారు. ఆయన తప్ప మిగిలిన వాళ్లంతా.. ఘటనను తప్పుదోవ పట్టించేందుకు వ్యూహాలు పన్నుతున్నట్టనిపిస్తోందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనల్లో తప్పుదారి పట్టించేలా మాట్లాడటం బాధాకరమని తనదైన శైలిలో పేర్కొన్నారు.

  • As far as the Jubilee Hills gang rape case is concerned, it seems to me as a common man that only @RaghunandanraoM seems to be truthful to the point and all others are using diversion tactics ..SAD

    — Ram Gopal Varma (@RGVzoomin) June 7, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"జూబ్లీహిల్స్‌ ఘటనపై భాజపా ఎమ్మెల్యే రఘునందన్‌రావు మాత్రమే నిజాయితీగా మాట్లాడుతున్నారు. మిగతా వారంతా తప్పుదోవ పట్టించేలా వ్యవహరించడం బాధాకరం." - రాంగోపాల్​ వర్మ, దర్శకుడు

జూబ్లీహిల్స్‌ ఘటన బాహ్య ప్రపంచానికి తెలియక ముందే దుబ్బాక భాజపా ఎమ్మెల్యే రఘునందనరావు మీడియా సమావేశం నిర్వహించి నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ప్రముఖల పిల్లలు ఉండటంతోనే కేసు దర్యాప్తును పోలీసులు నీరుగారుస్తున్నారని ఆరోపణలు చేశారు. ఘటనకు సంబంధించి కొన్ని కీలకమైన ఫొటోలు, వీడియోలు మీడియాకు విడుదల చేశారు. కాగా.. ఘటనలో బాధితురాలితో పాటు ఒక్కరు తప్ప మిగతా నిందితులంతా కూడా మైనర్లు కావటం వల్ల.. ఆ ఫొటోలు, వీడియోలు బయటపెట్టినందుకు రఘునందన్‌పై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు.. ఈ ఘటనలో ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్​కు తరలించారు. నిందితుల్లో ప్రధాన నిందితుడు మేజర్​ కాగా.. అతడిని మూడు రోజుల పాటు కస్టడీకి న్యాయస్థానం అనుమతించింది. మిగతా మైనర్లను జువైనల్​ కోర్టుకు తరలించారు.

సంబంధిత కథనాలు..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.