ETV Bharat / city

Oil Palm Cultivation : ఆయిల్‌పాం సాగుకు అన్నీ అవరోధాలే.. - తెలంగాణలో ఆయిల్‌పాం సాగుకు అడ్డంకులు

Oil Palm Cultivation : రాష్ట్రంలో ఆయిల్‌పాం పంట సాగును పెంచాలన్న సర్కార్ లక్ష్యానికి అనేక అడ్డంకులు వస్తున్నాయి. విదేశాల నుంచి ఒకేసారి లక్షల మొక్కలు తీసుకొద్దామనుకుంటే.. ఆ కంపెనీలు తరచూ మొక్కల ధరలు పెంచేస్తున్నాయి. మరోవైపు.. ప్రభుత్వ రాయితీ నిధులు విడుదల కాక, ఇటు బ్యాంకులు పంటరుణాలివ్వక ఈ పంట సాగు విస్తీర్ణం అనుకున్నంత వేగంగా పెంచడం సాధ్యం కాదన్నది అధికారవర్గాలు చెబుతున్నాయి.

Oil Palm Cultivation
Oil Palm Cultivation
author img

By

Published : Aug 1, 2022, 8:04 AM IST

రాష్ట్రంలో ఆయిల్‌పాం పంట సాగు విస్తీర్ణం రికార్డుస్థాయిలో పెంచాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అనేక అవరోధాలు ఎదురవుతున్నాయి. ఈ పంట వేయాలంటే మొక్కలను మలేసియా, ఇండోనేసియా, థాయ్‌లాండ్‌ వంటి దేశాల నుంచి కొనాలి. ఒకేసారి లక్షల మొక్కలు కావాలని తెలంగాణ నుంచి విన్నపాలు వస్తుండటంతో ధరలను విదేశీ కంపెనీలు తరచూ పెంచేస్తున్నాయి. ఆరునెలల క్రితం మొక్క ధర రూ.50 లోపుంటే ఇప్పుడు 90కి చేరింది. ఈ ధరకైనా వెంటనే సరఫరా చేయలేమంటున్నాయి.

ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 5 లక్షల ఎకరాల్లో ఈ పంట సాగు చేయించాలని తొలుత లక్ష్యంగా పెట్టిన ప్రభుత్వం మొక్కల కొరతతో దానిని తాజాగా 2 లక్షలకు తగ్గించింది. ఈ లక్ష్యం చేరాలన్నా మొక్కలు సరిపోతాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రైవేట్‌ కంపెనీలు విదేశాల నుంచి నారు తెప్పించి ఇక్కడ నర్సరీల్లో 9 నెలలు జాగ్రత్తగా పెంచి కనీసం 2 అడుగుల ఎత్తు పెంచాకే పొలంలో నాటడానికి రైతులకివ్వాలి. మొక్క ధరలో రూ.193 చొప్పున రాయితీగా భరిస్తామని ప్రభుత్వం ప్రైవేటు కంపెనీలకు తెలిపింది. కానీ ప్రస్తుతం నారు తెచ్చి 9 నెలలు పెంచి రైతుకివ్వాలంటే రూ.200 దాటుతోందని కంపెనీలు వాదిస్తున్నాయి. పైగా రూ.20 కోట్ల రాయితీ నిధుల బకాయిలు ఉండటంతో కంపెనీలు నిదానంగా వ్యవహరిస్తున్నాయి.

రైతులకు ఆర్థిక సాయం ఎలా.. ఆయిల్‌పాం పంట సాగుచేస్తే బిందుసేద్యానికి రూ.22 వేలు, మొక్కల ధరలో మినహాయింపు కింద రూ.11 వేలు, ఇతర ఖర్చులకు మరో రూ.4,200 కలిపి రూ.37,200 రాయితీగా రైతులకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ఈ ఏడాది బడ్జెట్‌లో రూ.వెయ్యికోట్లను కేటాయించింది. వీటిని ప్రతి త్రైమాసికానికోసారి రూ.250 కోట్ల చొప్పున విడుదల చేయాలి. కానీ మొదటి త్రైమాసికం ముగిసి రెండో త్రైమాసికంలో నెల గడిచినా నిధులేమీ విడుదల కాకపోవడంతో రైతులకు ఇవ్వడం లేదు. రాయితీ నిధులు వచ్చేలోగా బ్యాంకుల నుంచి రుణాలిప్పించి కర్షకులతో పంట సాగుచేయించాలని ప్రభుత్వం ఉద్యానశాఖకు సూచించింది.

అయితే, నిబంధనల ప్రకారం ఆయిల్‌పాంకు ‘పంటరుణం’ ఇవ్వడం కుదరదని, కేవలం దీర్ఘకాలిక రుణమే ఇస్తామని బ్యాంకు అధికారులు నిక్కచ్చిగా చెబుతున్నారు. పంటరుణం తీసుకుని ఏడాదిలోగా కడితే 4 శాతం వడ్డీ పడుతుంది. కానీ దీర్ఘకాలిక రుణం తీసుకుంటే ఏడాదికి 12 శాతం వరకు వడ్డీ పడుతుందని, అంత వడ్డీ భారంతో తీసుకుంటే అప్పుల పాలవుతామని రైతులు ఆందోళన చెందుతున్నారు. అటు ప్రభుత్వ రాయితీ నిధులు విడుదల కాక, ఇటు బ్యాంకులు పంటరుణాలివ్వక ఈ పంట సాగు విస్తీర్ణం అనుకున్నంత వేగంగా పెంచడం సాధ్యం కాదన్నది అధికారవర్గాలు చెబుతున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.