ETV Bharat / city

Different types of paneer recipes: పనీర్‌ కూరలు... నచ్చాయా! ఆ రుచే వేరు!

Different types of paneer recipes: రోటీ నుంచి బిర్యానీ వరకూ దేనికైనా సరే... జతగా పనీర్‌ కూర ఉంటే తిరుగేముంటుంది చెప్పండీ. కానీ... ఆ కూరను ఏ రుచిలో చేసుకోవాలనేదే సందేహమైతే... ఇలా ప్రయత్నించి చూస్తే సరి. ఈ రుచే వేరు..

different types of paneer recipes
రకరకాల పనీరు వంటకాలు
author img

By

Published : Sep 12, 2022, 6:29 AM IST

Different types of paneer recipes: మనం ఎన్ని కూరలు తిన్నాసరే... అందులో పనీరు కూర వచ్చేంత రుచి ఇంకా ఏ కూరకీ రాదు. ఆలూ - పనీరు కూర అయితే ఇంకా ఆ రుచే వేరు.. రెస్టారెంట్​లలో ఎన్నో డబ్బులు పెట్టి ఈ కూరలు తినడానికి వెళతాము.. ఎందుకంటే అక్కడ వచ్చే రుచి మనం వండుకుంటే రాదు.. అందుకే ఇప్పుడు అదే రుచిని మన వంటకాల్లో రావాలంటే ఏమి చేయాలో చూద్దామా... కొన్ని పనీరు కూరలు గురించి తెలుసుకుందాము..

పనీర్‌ ఘీరోస్ట్‌:

.

కావలసినవి: పనీర్‌ ముక్కలు: రెండు కప్పులు, ఎండుమిర్చి: పది, దనియాలు: చెంచా, జీలకర్ర: చెంచా, సోంపు: చెంచా, మిరియాలు: చెంచా, అల్లం: చిన్నముక్క, వెల్లుల్లి రెబ్బలు: మూడు, పసుపు: చిటికెడు, నెయ్యి: పావుకప్పు, ఉల్లిపాయ: ఒకటి, పెరుగు: పావుకప్పు, ఉప్పు: తగినంత.

తయారీ విధానం: స్టౌమీద కడాయి పెట్టి... ఎండుమిర్చి, దనియాలు, జీలకర్ర, సోంపు, మిరియాలు వేయించుకుని తీసుకోవాలి. ఈ దినుసులూ, అల్లంవెల్లుల్లీ, పసుపూ మిక్సీలో వేసుకుని కొద్దికొద్దిగా నీళ్లు చల్లుకుంటూ మెత్తని పేస్టులా చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టౌమీద కడాయిని పెట్టి నెయ్యి వేయాలి. అది వేడెక్కాక పనీర్‌ ముక్కల్ని వేయించుకుని తీసుకోవాలి. అదే కడాయిలో... ఉల్లిపాయముక్కల్ని వేయించుకుని చేసిపెట్టుకున్న మసాలా, పెరుగు, తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి. రెండు నిమిషాలయ్యాక వేయించుకున్న పనీర్‌ ముక్కలు వేసి బాగా కలిపి పనీర్‌ ముక్కలకు ఆ మసాలా పట్టిందనుకున్నాక స్టౌని కట్టేయాలి.

పనీర్‌ కోకోనట్‌ మసాలా:

.

కావలసినవి: పనీర్‌ ముక్కలు: రెండు కప్పులు, ఉల్లిపాయ: ఒకటి, టొమాటోలు: రెండు, గరంమసాలా: చెంచా, ఉప్పు: తగినంత, వెన్న: మూడు టేబుల్‌స్పూన్లు, కసూరీమేథీ: చెంచా.
మసాలాకోసం: దనియాలు: టేబుల్‌స్పూను, జీలకర్ర: అరటేబుల్‌స్పూను, ఎండుమిర్చి: నాలుగు, వెల్లుల్లి రెబ్బలు: మూడు, అల్లం: చిన్న ముక్క, ఉల్లిపాయ: ఒకటి, తాజా కొబ్బరి తురుము: పావుకప్పు.

తయారీ విధానం: స్టౌమీద కడాయిని పెట్టి... దనియాలు, జీలకర్ర, ఎండుమిర్చిని వేయించుకుని తీసుకోవాలి. అదే బాణలిలో టేబుల్‌స్పూను వెన్న వేసి... వెల్లుల్లి, అల్లం, ఉల్లిపాయ ముక్కలు, కొబ్బరి తురుము వేసి వేయించుకోవాలి. తరువాత ఈ పదార్థాలూ, ముందుగా వేయించిపెట్టుకున్న దినుసులూ, కొద్దిగా ఉప్పూ మిక్సీలో వేసుకుని మెత్తని పేస్టులా చేసుకోవాలి. ఈ మసాలాలో పనీర్‌ ముక్కల్ని వేసి వాటికి ఈ మిశ్రమం పట్టేలా బాగా కలపాలి. అరగంట అయ్యాక స్టౌమీద కడాయి పెట్టి మిగిలిన వెన్న వేసి... ఉల్లిపాయముక్కల్ని ఎర్రగా వేయించుకుని తరువాత టొమాటో ముక్కలు వేయాలి. టొమాటో ముక్కలు మెత్తగా మగ్గాయనుకున్నాక గరంమసాలా, పనీర్‌ ముక్కలు, పావుకప్పు నీళ్లు, మరికొంచెం ఉప్పు వేసుకుని కలపాలి. అయిదు నిమిషాలయ్యాక కసూరీమేథీ వేసి దింపేస్తే చాలు.

పనీర్‌ టొమాటో కర్రీ:

.

కావలసినవి: నూనె: పావుకప్పు, పనీర్‌ ముక్కలు: ఒకటిన్నర కప్పు, జీలకర్ర: చెంచా, వెల్లుల్లి తరుగు: రెండు చెంచాలు, ఉల్లికాడల తరుగు: అరకప్పు, పచ్చిమిర్చి ముక్కలు: రెండు చెంచాలు, టొమాటో గుజ్జు: పావుకప్పు, టొమాటో ముక్కలు: పావుకప్పు, టొమాటో కెచప్‌: రెండు టేబుల్‌స్పూన్లు, దనియాలపొడి: చెంచా, కారం: రెండు చెంచాలు, పసుపు: అరచెంచా, ఉప్పు: తగినంత, గరంమసాలా: అరచెంచా, చిక్కని పాలు: పావుకప్పు, క్రీమ్‌: పావుకప్పు.

తయారీ విధానం: స్టౌమీద కడాయిని పెట్టి నూనె వేయాలి. అది వేడెక్కాక పనీర్‌ ముక్కల్ని వేసి దోరగా వేయించుకుని విడిగా తీసుకోవాలి. అదే బాణలిలో జీలకర్ర వేయించుకుని తరువాత వెల్లుల్లి తరుగు, ఉల్లికాడల తరుగు, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించుకోవాలి. ఇందులో టొమాటో గుజ్జు, టొమాటో ముక్కలు, టొమాటో కెచప్‌ ఒకదాని తరువాత మరొకటి వేసుకుని బాగా కలపాలి. అయిదు నిమిషాలయ్యాక దనియాలపొడి, కారం, పసుపు, తగినంత ఉప్పు, గరంమసాలా వేసి కలిపి పావుకప్పు నీళ్లు పోయాలి. అన్నీ ఉడుకుతున్నప్పుడు పనీర్‌ ముక్కలు, పాలు, క్రీమ్‌ వేసి బాగా కలిపి దగ్గరకు అవుతున్నప్పుడు దింపేయాలి.

సెలెబ్రిటీ స్పెషల్‌:

చపాతీ నూడుల్స్‌..

కీర్తి సురేశ్​ వండిన చపాతీ నూడిల్స్​

నాకు తీరిక దొరికినప్పుడల్లా రకరకాల వంటకాలను చేసేందుకు ప్రయత్నిస్తుంటా. ఆ మధ్య వంటకాలకు సంబంధించిన ఓ ఆన్‌లైన్‌ వేదిక ద్వారా చపాతీ నూడుల్స్‌ చేయడం నేర్చుకున్నాను. చపాతీలు మిగిలిపోయినప్పుడు వాటిని అలాగే కాకుండా నూడుల్స్‌ చేసుకుంటే భలే ఉంటాయి తెలుసా...

తయారీ విధానం.. అయిదు చపాతీలు, మూడు చెంచాల నూనె, మూడు వెల్లుల్లి రెబ్బలు, ఒక పచ్చిమిర్చి, పావుకప్పు చొప్పున సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు- క్యాబేజీ తరుగు - ఉల్లికాడల తరుగు, ఒక్కోటి చొప్పున క్యారెట్‌- క్యాప్సికం, రెండు టేబుల్‌స్పూన్ల టొమాటోసాస్‌, కొద్దిగా వినెగర్‌, టేబుల్‌స్పూను సోయాసాస్‌, తగినంత ఉప్పు, అరచెంచా కారం సిద్ధంగా పెట్టుకోవాలి. ముందుగా చపాతీలను రోల్‌లా చుట్టుకుని సన్నగా పొడుగ్గా వచ్చేలా ముక్కల్లా కోసుకోవాలి. ఇప్పుడు స్టౌమీద కడాయిని పెట్టి, నూనె వేసి వెల్లుల్లి తరుగు, పచ్చిమిర్చి వేయించుకుని కూరగాయల ముక్కలన్నీ వేసి మళ్లీ వేయించాలి. తరవాత అన్నిరకాల సాస్‌లు, వినెగర్‌, తగినంత ఉప్పు, కారం వేసి బాగా కలపాలి. చివరగా ఇందులో చపాతీముక్కల్ని వేసి వాటికి మసాలా పట్టేవరకూ బాగా కలిపి దింపేస్తే చాలు... చపాతీ నూడుల్స్‌ రెడీ... - కీర్తి సురేశ్​

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.