రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ధరణి పోర్టల్ ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 29న మధ్యాహ్నం 12.30 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ దీనిని ప్రారంభించనున్నారు. ఇందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. దసరా పండుగ రోజు ధరణి పోర్టల్‌ను ప్రారంభించాలని అనుకున్నప్పటికీ వాయిదా పడింది.
ప్రయోగాత్మకంగా పరిశీలన
రెవెన్యూ సంస్కరణల్లో విప్లవాత్మకమైనదిగా రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంటున్న ధరణి పోర్టల్‌లో ప్రయోగాత్మకంగా భూముల నమోదు ప్రక్రియ విజయవంతంగా జరిగింది. రాష్ట్రంలోని 570 మండలాల్లో తహసీల్దార్లు ఒక్కో మండలంలో 10 దస్తావేజుల రిజిస్టేష్రన్‌ను పూర్తి చేశారు. ఎక్కడైనా సాంకేతిక సమస్యలు వస్తే సరిచేయాలని అధికారులు భావించారు. కానీ ఎక్కడా ఇబ్బందులు తలెత్తలేదని అధికార వర్గాలు తెలిపాయి. ధరణిపై ఇప్పటికే జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలు, తహసీల్దార్లు, కంప్యూటర్ ఆపరేటర్లకు దృశ్యరూపక ప్రదర్శన ఇచ్చారు.
ఇవీ చూడండి: మద్దతు ధర చెల్లించి మక్కలు కొనుగోలు చేస్తాం: సీఎం