ETV Bharat / city

DH on Corona Fourth Wave: మళ్లీ కేసులు పెరుగుతున్నాయి.. జాగ్రత్త!

DH on Corona Fourth Wave: రాష్ట్రంలో కొన్ని రోజులుగా కొవిడ్‌ కేసులు పెరుగుతున్నాయని.. ప్రతి ఒక్కరూ బయటకు వెళ్లినప్పుడు తప్పకుండా మాస్క్‌లు ధరించాలని ప్రజారోగ్య సంచాలకులు (డీహెచ్‌) శ్రీనివాసరావు సూచించారు. ఈనెల 3 నుంచి ఇంటింటికీ కొవిడ్ టీకాలు పంపిణీ చేస్తున్నట్టు తెలిపిన డీహెచ్... జీహెచ్​ఎంసీ పరిధిలో 12 నుంచి 18 ఏళ్ల వయస్కుల్లో చాలామంది టీకా తీసుకోలేదని వివరించారు. వచ్చేవారం విద్యాసంస్థలు ప్రారంభమవుతున్నందున 12 ఏళ్లు దాటినవారు టీకా తీసుకోవాలని కోరారు.

DH SRINIVASA RAO
DH SRINIVASA RAO
author img

By

Published : Jun 10, 2022, 8:19 PM IST

Updated : Jun 10, 2022, 8:41 PM IST

మళ్లీ కేసులు పెరుగుతున్నాయి.. జాగ్రత్త!

DH on Corona Fourth Wave: దేశంలో వరుసగా రెండోరోజు ఏడువేలకుపైగా కొవిడ్‌ కేసులు నమోదైన వేళ రాష్ట్ర సర్కార్‌ అప్రమత్తమైంది. స్థానికంగా కూడా కరోనా కేసులు పెరుగుతుండగా... ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు తెలిపారు. ప్రతి ఒక్కరు కొవిడ్ నిబంధనలు పాటించాలని కోరారు. రాష్ట్రంలో కొవిడ్‌ పరిస్థితిపై శుక్రవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ‘‘తెలంగాణలో గత వారం 355 కేసులు నమోదు కాగా.. ఈ వారం 555 కేసులు నమోదయ్యాయి. దాదాపు 56శాతం పైగా కేసులు పెరిగాయి. దేశవ్యాప్తంగా యాక్టివ్‌ కేసుల సంఖ్య 36వేలకు పైనే ఉండగా.. తెలంగాణలో 811 మంది బాధితులు ఉన్నారు.

థర్డ్‌ వేవ్‌లో ఒమిక్రాన్‌ కేసులు భారీగా వచ్చిన తర్వాత తగ్గుముఖం పట్టి.. మళ్లీ గత రెండు వారాలుగా కొత్త కేసుల పెరుగుదలను చూస్తున్నాం. రాష్ట్రంలో కేసుల సంఖ్య పెరుగుతున్నా.. ఆస్పత్రిలో చేరికలు, మరణాలు దాదాపు సున్నాగానే ఉన్నాయి. తెలంగాణలో 811 క్రియాశీల కేసులు ఉంటే.. ప్రైవేటు ఆస్పత్రుల్లో చేరికలు మాత్రం కేవలం రెండు మూడు మాత్రమే ఉన్నాయి. మరణాలు కూడా గత రెండు నెలల నుంచి సున్నాగానే కొనసాగుతున్నాయి. గత మూడు రోజుల నుంచి 100కు పైగా కేసులు వస్తున్నాయి. రెండున్నర నెలల తర్వాత మళ్లీ ఈ స్థాయిలో కేసులు రావడం చూస్తున్నాం’’ అని డీహెచ్‌ వివరించారు.

ఫోర్త్‌వేవ్‌ వచ్చే అవకాశాలు చాలా తక్కువ!: ‘‘దేశంలో గానీ, తెలంగాణ రాష్ట్రంలో గాని ఫోర్త్‌ వేవ్‌ వచ్చే అవకాశాలు చాలా తక్కువ. ఆస్పత్రుల్లో చేరికలు, మరణాలు అతి స్వల్పంగానే ఉండే అవకాశం ఉంది. వ్యాక్సినేషన్‌ కవరేజీ దాదాపు నూరు శాతం కావడం వల్ల ఎక్కువ మందిలో ఇమ్యూనిటీ తీసుకురాగలిగాం. ఇప్పుడు కేసులు కొంచెం పెరుగుతున్నా.. ఫోర్త్‌వేవ్‌కు కారణం కాకపోవచ్చు. మే నెల నుంచి ఇప్పటివరకు ఒమిక్రాన్‌ సబ్‌వేరియంట్‌ బీఏ 2 కేసులే దాదాపు 65శాతం నమోదయ్యాయి. గత రెండు రోజుల నుంచి బీఏ 4, బీఏ 5 వేరియంట్లకు సంబంధించిన కేసులు పెరుగుదల చూస్తున్నాం. ఈ ఒమిక్రాన్‌ సబ్‌ వేరియంట్లతో ఫోర్త్‌వేవ్‌ వచ్చే అవకాశం లేదు’’ అని పేర్కొన్నారు.

కరోనా ఇంకా పోలేదు.. మనతోనే ఉంది!: ‘‘కరోనా వైరస్‌ ఇంకా పూర్తిగా కనుమరుగు కాలేదు. మనతో పాటే ఉంది. ఇది పూర్తిగా నిర్మూలన అయ్యేందుకు ఇంకా సమయం పడుతుంది. పాండమిక్‌గా మొదలైన ఈ మహమ్మారి.. ప్రస్తుతం ఎండమిక్‌ స్టేజిలో కొనసాగుతోంది. ఈ డిసెంబర్‌ నాటికి లేదా వచ్చే ఏడాది మధ్య కల్లా పూర్తిగా ఎండమిక్‌ స్థాయికి చేరే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మాత్రం ఇంకో ఆర్నెళ్ల పాటు ఇలాంటి కేసుల పెరుగుదల అప్పుడప్పుడూ చూస్తుంటాం. ఇలా కేసులు పెరగడాన్ని చూసి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కాకపోతే తగిన జాగ్రత్తలు తీసుకోండి. కొవిడ్‌ వ్యాప్తి నియంత్రణకు ఏకైక అస్త్రంగా ఉన్న మాస్క్‌ను పెట్టుకోండి. బహిరంగ ప్రదేశాలు, ప్రజారవాణాలో ప్రయాణించేటప్పుడు మాస్క్‌ పెట్టుకోవడం మరిచిపోవద్దు.

ఈ వర్షా కాలం ఫ్లూ సీజన్‌ గనక ఆ లక్షణాల నుంచి కొవిడ్‌ను గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోండి. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులకు మీ నుంచి వైరస్‌ వ్యాప్తి చెందకుండా చూసుకోండి. పిల్లలకు వ్యాక్సినేషన్‌ వేయించడం అత్యంత అవసరం. 12 నుంచి 18 ఏళ్ల పిల్లలకు వ్యాక్సిన్‌ అందుబాటులో ఉంది. ఈ వయస్సు పిల్లలకు దాదాపు 90శాతం మేరకు టీకా ఇచ్చాం. కానీ, జీహెచ్‌ఎంసీ పరిధిలోని ప్రైవేటు పాఠశాలల్లో చదివే విద్యార్థులకు వ్యాక్సినేషన్‌ కవరేజీ చాలా తక్కువగా ఉంది. త్వరలోనే పాఠశాలలు తెరుచుకోనుండటంతో పాఠశాల యాజమాన్యాలు, తల్లిదండ్రులు పిల్లలందరికీ టీకాలు వేయించేలా తగిన చర్యలు తీసుకోవాలి’’ అని డీహెచ్‌ సూచించారు.

ఇవీ చదవండి:'ఆడవాళ్లకి కష్టమొస్తే చూస్తూ ఊరుకోలేను.. ఆ బాధ్యత ప్రభుత్వానిదే'

Last Updated : Jun 10, 2022, 8:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.