ఒమిక్రాన్(Omicron Variant Latest News)ను ఎదుర్కునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని.. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డీహెచ్ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, కొత్త వేరియంట్, ప్రభుత్వ సన్నద్ధతపై రెండు గంటల పాటు మంత్రి హరీశ్‌రావు ఆధ్వర్యంలో సమీక్ష(Harish Rao Review on Omicron) నిర్వహించారు. కొత్త వేరియంట్ వస్తున్న నేపథ్యంలో ఆరోగ్య శాఖ అప్రమత్తంగా ఉందని(Measures to control Corona New Variant) డీహెచ్ వెల్లడించారు. రాష్ట్రంలో కరోనా కేసులు(corona cases telangana) నిలకడగానే ఉన్నాయని.. ఇప్పటివరకు కొత్త వేరియంట్ నమోదు కాలేదని పేర్కొన్నారు. అయినప్పటికీ.. ప్రజలంతా కొవిడ్ జాగ్రత్తలు పాటిస్తూ.. అప్రమత్తంగా ఉండాలని డీహెచ్ సూచించారు. అందరూ.. రెండు రోసుల వ్యాక్సిన్(corona vaccine update telangana) తప్పనిసరిగా వేసుకోవాలని శ్రీనివాస్ తెలిపారు.
అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నాం..
"రెండు రోజుల నుంచి పరిస్థితులు మానిటర్ చేస్తున్నాం. రాష్ట్రంలో కేసుల పెరుగుదల గమనించలేదు. నిలకడగానే ఉన్నాయి. దేశంలో కొత్త వేరియంట్ నమోదు కాలేదు. కొత్త వేరియంట్ రాకుండా అడ్డుకునేలా ఎయిర్‌పోర్టులో స్క్రీనింగ్ పెంచాం. అక్కడే ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేస్తున్నాం. 14 రోజుల పాటు హోం క్వారెంటైన్ ఉండేలా చర్యలు తీసుకొని వారి ఆరోగ్యాన్ని మానిటర్ చేస్తున్నాం. మూడో వేవ్ విషయంలో మనం ఇప్పటికే అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నాం. ప్రజలు ఆందోళన చేయాల్సిన అవసరం లేదు. నాలుగైదు నెలలుగా రాష్ట్రంలో 100 నుంచి 150 మధ్యలోనే కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో 90 శాతం మొదటి డోసు, 45 శాతం రెండో డోసు ఇచ్చాం. వ్యవధి గడిచినా రెండో డోసును 25 లక్షల మంది తీసుకోలేదు. కరోనా కేసులు తగ్గడం వల్ల వ్యాక్సిన్ పట్ల, కరోనా నిబంధనలు పాటించడంలో కొంత నిర్లక్ష్యం వహిస్తున్నట్టు గమనించాం. ఏ వేరియంట్ అయినా ఎదుర్కోవడం మన చేతుల్లోనే ఉంది. మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం, చేతులు శుభ్రంగా ఉంచుకోవాలి. ప్రతీ ఒక్కరు రెండు డోసుల వ్యాక్సిన్ తప్పని సరిగా తీసుకోవాలి." - శ్రీనివాసరావు, డీహెచ్
ప్రజలు ఆందోళన చెందొద్దు..
కొత్త వేరియంట్‌ను ఎదుర్కునేందుకు ప్రభుత్వం తరఫున అన్ని చర్యలు తీసుకున్నామని డీఎంఈ రమేశ్‌రెడ్డి తెలిపారు. ప్రజలు బాధ్యతగా వ్యాక్సిన్ వేసుకోవాలని సూచించారు. మాస్కులు తప్పనిసరిగా ధరించాలన్నారు. ఇతర కొవిడ్ నిబంధనలు పాటించాలన్నారు. వైరస్ ఉత్పరివర్తనాలు చాలా జరుగుతాయన్నారు. కొత్త రకం వెరియంట్ ఎంత ప్రమాదకరం అనే దానిపై ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయని.. ప్రజలు ఆందోళన చెందొద్దని రమేశ్‌రెడ్డి వివరించారు.
ఇవీ చూడండి: