DH Srinivas Pushpa Dialogue: రాష్ట్రంలో కరోనా నిబంధనలేవీ లేనప్పటికీ.. వ్యక్తిగత బాధ్యతగా ప్రతి ఒక్కరు మాస్క్ ధరించాలని ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాస్ రావు సూచించారు. కేంద్రం కొవిడ్ ఆంక్షలను పూర్తిగా ఎత్తివేసిందని పేర్కొన్న డీహెచ్.. కరోనా పూర్తిగా తొలగిపోలేదని గుర్తుచేశారు. రాష్ట్రంలో కరోనా పూర్తిగా అదుపులో ఉందని.. కేవలం 30 నుంచి 40 కేసులు మాత్రమే నమోదవుతున్నాయన్నారు. సుమారు 20 జిల్లాల్లో అసలు కేసులే నమోదుకావట్లేదని.. భవిష్యత్తులో అన్ని జిల్లాల్లో జీరో కేసులు నమోదవుతావుతాయని ఆకాంక్షించారు. ఇకపై ఎలాంటి వేరియంట్లు వచ్చినా ఎదుర్కొనేందుకు ఆరోగ్యశాఖ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఎలాంటి వైరస్లు వచ్చినా తగ్గేదేలే అంటూ.. ఉత్సాహంగా సినిమా డైలాగులు చెప్పారు.
"రాష్ట్రంలో కరోనా పూర్తిగా అదుపులో ఉంది. కేవలం 30 నుంచి 40 కేసులే రిపోర్టవుతున్నాయి. సుమారు 20 జిల్లాల్లో జీరో కేసులు నమోదవుతున్నాయి. త్వరలోనే అన్ని జిల్లాల్లో జీరో కేసులు నమోదవుతాయి. కేంద్రం కరోనా ఆంక్షలన్నింటినీ ఎత్తివేసింది. నిబంధనలేవీ లేనప్పటికీ.. వ్యక్తిగత బాధ్యతగా మాస్కు ధరించాలి. ఇకపై వేరియంట్లన్ని గుంపులుగా వచ్చినా.. ఒక్కొక్కటిగా వచ్చినా ఎదుర్కునేందుకు సిద్ధంగా ఉన్నాం. ఎలాంటి వైరస్ వచ్చినా వైద్య సేవలు అందించటంలో తగ్గేదేలే."
- శ్రీనివాస్‌రావు, డీహెచ్
ఇదీ చూడండి: