ETV Bharat / city

సైబర్​ నేరాల బారిన పడకుండా 'సైబ్​ హర్​' - ts dgp latest

మహిళలు, చిన్నారులు సైబర్​ నేరాల బారిన పడకుండా ఉండేందుకు 'సైబ్ హర్' పేరుతో నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని డీజీపీ మహేందర్​రెడ్డి ప్రారంభించారు. సింబియాసిస్ విశ్వవిద్యాలయం సహకారంతో మహిళా భద్రతా విభాగం ఆధ్వర్యంలో దీన్ని నిర్వహిస్తున్నారు. ఫేస్​బుక్, ఇన్​స్టాగ్రామ్, ట్విట్టర్, యూట్యూబ్​తో పాటు ప్రసార మాధ్యమాల ద్వారా సైబర్ నేరాలపై అవగాహన కల్పించేలా మహిళా భద్రతా విభాగం అధికారులు ప్రణాళిక రచించారు.

http://10.1సైబర్​ నేరాల బారిన పడకుండా 'సైబ్​ హర్​'0.50.75:6060///finalout2/bihar-nle/finalout/15-July-2020/8041825_rcp.jpeg
సైబర్​ నేరాల బారిన పడకుండా 'సైబ్​ హర్​'
author img

By

Published : Jul 15, 2020, 10:08 PM IST

అంతర్జాలంలో సామాజిక మాధ్యమాలను సురక్షితంగా ఎలా ఉపయోగించుకోవాలనే దానిపై మహిళలకు, చిన్నారులకు అవగాహన కల్పించేలా ఉద్దేశించిన కార్యక్రమాన్ని డీజీపీ మహేందర్ రెడ్డి ప్రారంభించారు. మహిళా విభాగం ఆధ్వర్యంలో 'సైబ్ హర్' పేరుతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని నెల రోజుల పాటు నిర్వహించనున్నారు. సామాజిక మాధ్యమాలు వినియోగించే సమయంలో సరైన అవగాహన లేక మహిళలు, చిన్నారులు సైబర్ నేరాల బారిన పడే అవకాశం ఉంది. ఇలాంటి వాటిని ఎలా గ్రహించాలి అనేదానిపై మహిళలకు చిన్నారులకు అవగాహన కల్పించనున్నారు.

సింబియాసిస్ విశ్వవిద్యాలయం సహకారంతో మహిళా భద్రతా విభాగం ఆధ్వర్యంలో దీన్ని నిర్వహిస్తున్నారు. ఫేస్​బుక్, ఇన్​స్టాగ్రామ్, ట్విట్టర్, యూట్యూబ్​తో పాటు ప్రసార మాధ్యమాల ద్వారా సైబర్ నేరాలపై అవగాహన కల్పించేలా మహిళా భద్రతా విభాగం అధికారులు ప్రణాళిక రచించారు. మహిళలు, చిన్నారులను అవగాహన కలిగించేలా నెల రోజుల పాటు పలు అంశాలపై ఆన్‌లైన్ వేదికగా వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించనున్నారు.

  • Launching of Online Campaign : #CybHer
    Towards a safer cyber world for women and children.
    Get aware of Cyber Risks and countermeasures. pic.twitter.com/LmAudHLSIz

    — DGP TELANGANA POLICE (@TelanganaDGP) July 15, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.