ETV Bharat / city

DGP Mahender reddy speech: 'సాంకేతికత పురోగతితో సంప్రదాయ నేరాల దర్యాప్తు వేగవంతం'

dgp mahender reddy speech: హైదరాబాద్‌లో అసోసియేషన్ ఆఫ్ సర్టిఫైడ్ ఫ్రాడ్ ఎగ్జామినర్స్- ఏసీఎఫ్‌ఈ చాప్టర్ ఆధ్వర్యంలో 3వ వార్షిక సమావేశంలో డీజీపీ మహేందర్​రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. "అన్‌ఫోల్డింగ్ ఫ్రాడ్ డిటరెన్స్" అనే థీమ్‌లో భాగంగా జరిగిన సదస్సులో సైబర్ మోసాలు– ట్రాన్స్‌ఫార్మేటివ్ ట్రెండ్స్, సైబర్ చట్టం, మిటిగేషన్ మెథడ్స్‌, బ్యాకింగ్, ఆర్థిక మోసాలు, బ్లాక్ చైన్ టెక్నాలజీ వినియోగం, వ్యక్తిగత డేటా రక్షణ బిల్లు- 2019 వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు.

DGP Mahender reddy speech on unfolding fraud deterrence

author img

By

Published : Dec 11, 2021, 9:12 PM IST

DGP Mahender reddy speech: సాంకేతికతలో వేగవంతమైన పురోగతి, చట్టం అమలు చేసే ఏజెన్సీల విస్తృత వినియోగం కారణంగా సంప్రదాయ నేరాలు కూడా దర్యాప్తు అవుతున్నాయని డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్‌లో అసోసియేషన్ ఆఫ్ సర్టిఫైడ్ ఫ్రాడ్ ఎగ్జామినర్స్- ఏసీఎఫ్‌ఈ చాప్టర్ ఆధ్వర్యంలో 3వ వార్షిక సమావేశంలో డీజీపీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. హైబ్రిడ్ మోడ్‌లో ఈ కార్యక్రమానికి ఆ సంస్థ అంతర్జాతీయ అధ్యక్షుడు బ్రూస్ డోరిస్, హైదరాబాద్ చాప్టర్ ప్రెసిడెంట్ శరత్ కుమార్, సీపీ స్టీఫెన్ రవీంద్ర, అంతర్జాతీయ సైబర్ సెక్యూరిటీ నిపుణుడు అమిత్ దూబేసహా 100 మంది సభ్యులు భౌతికంగా... అనేక దేశాల నుంచి ఆన్‌లైన్‌లో హాజరయ్యారు.

ACFE Hyderabad Chapter organised its 3rd Annual Conference:"అన్‌ఫోల్డింగ్ ఫ్రాడ్ డిటరెన్స్" అనే థీమ్‌లో భాగంగా జరిగిన సదస్సులో సైబర్ మోసాలు– ట్రాన్స్‌ఫార్మేటివ్ ట్రెండ్స్, సైబర్ చట్టం, మిటిగేషన్ మెథడ్స్‌, బ్యాకింగ్, ఆర్థిక మోసాలు, బ్లాక్ చైన్ టెక్నాలజీ వినియోగం, వ్యక్తిగత డేటా రక్షణ బిల్లు- 2019 వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. తెలుగు రాష్ట్రాల్లో 250 మందికిపైగా సభ్యులు ఉన్న ఈ ఏసీఎఫ్‌ఈ మోసాలను అరికట్టడంలో చేస్తున్న విశేషమైన కృషి, నాణ్యమైన శిక్షణల ద్వారా సభ్యులకు అందిస్తున్న విజ్ఞాన నవీకరణలను డీజీపీ అభినందించారు. అసోషియేషన్ ఆఫ్ సర్టిఫైడ్ ఫ్రాడ్ ఎగ్జామినర్స్ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద లాభాపేక్ష లేని యాంటీ-ఫ్రాడ్ ఆర్గనైజేషన్ అని... అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకుంటూ ఎన్నో కేసులు విజయవంతంగా ఛేదింగల్గుతున్నామని అన్నారు.

మెరుగైన నైపుణ్యం అవసరమున్నట్టు ప్రభుత్వం గుర్తించిందని.. గుజరాత్ గాంధీనగర్‌లో ప్రత్యేకంగా నేషనల్ ఫోరెన్సిక్ యూనివర్సిటీని ఏర్పాటు చేశారని తెలిపారు. సాంకేతికత ఆధారిత మోసాలు, ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్న దృష్ట్యా పోలీసు శాఖ సన్నద్ధమవుతోందని తెలిపారు. పోలీసు శాఖలోని సిబ్బంది నైపుణ్యాలను మెరుగుపరుస్తున్నామన్నారు. ఏసీఎఫ్‌ఈ "రిపోర్ట్ టు ది నేషన్స్- 2020"ని ప్రస్తావిస్తూ... సీఎఫ్‌ఈలను సిబ్బందిగా కలిగి ఉన్న సంస్థలు 50 శాతం సత్వరం మోసాలు బయటపెట్టినట్లు తెలిపారు. మోసం, వైట్ కాలర్ నేరాల సంభవ్యాన్ని తగ్గించడంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు డీజీపీ పేర్కొన్నారు.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.